Tuesday, April 03, 2007

రాముడు భీముడు--1964



సంగీతం::పెండ్యాల నాగేశ్వర రావ్
రచన::కోసరాజు రాఘవయ్య

గానం::మాధవపెద్ది,జమునా రాణి

తారాగణం::N.T.రామారావు,జమున,S.V.రంగారావు,  
రాజనాల,L.విజయలక్ష్మి,శాంతకుమారి,రేలంగి,గిరిజ,రమణారెడ్డి.

పల్లవి::

సరదా సరదా సిగిరెట్టూ
ఇది దొరల్తాగుమరి సిగిరెట్టు
సరదా సరదా సిగిరెట్టూ
ఇది దొరల్తాగుమరి సిగిరెట్టు
పట్టుపట్టి ఒక దమ్ము లాగితే
స్వర్గానికె ఇది తొలి మెట్టూ
సరదా సరదా సిగిరెట్టూ
ఇది దొరల్తాగుమరి సిగిరెట్టు


కంపుకొట్టు ఈ సిగరెట్టు
ఇది కాల్చకోయి నా పై ఒట్టు
కంపుకొట్టు ఈ సిగరెట్టు
ఇది కాల్చకోయి నా పై ఒట్టు
కడుపు నిండునా కాలునిండునా
వదలిపెట్టవోయ్ నీ పట్టు
కంపుకొట్టు ఈ సిగరెట్టు
ఇది కాల్చకోయి నా పై ఒట్టు

చరణం:: 1


ఈ సిగరెట్టుతో ఆంజనేయుడూ
లంకా దహనం చేసాడు
" హా" ఎవడో కోతలు కోసాడూ..
ఈ పొగతోటి ఘుప్పు ఘుప్పునా
మేఘాలు సౄష్టించవచ్చు
మీసాలు కాల్చుకోవచ్చు
హాయ్...సరదా సరదా సిగిరెట్టూ
ఇది దొరల్తాగుమరి సిగిరెట్టు

చరణం:: 2


ఊపిరితిత్తుల క్యన్స్సర్ కిదియే
కారణమన్నారు డాక్టర్ల్లు
"హా.." కన్నారులే పెద్ద యాక్టర్లు..
పదను పేరుకొని కఫము చేరుకొని
ఉసురుదీయు పొమ్మన్నారూ...
ద్దద్ధమ్మలు అది విన్నారు
హా...కంపుకొట్టు ఈ సిగరెట్టు
ఇది కాల్చకోయి నా పై ఒట్టు

చరణం:: 3


పక్కనున్నవారీ సువాసనకు
ముక్కులు ఎగరేస్తారూ..
వాహ్..
నీవ్ ఎరగవు దీని ఉషారు
"అబ్బో..." తియేటర్లలో పొగతాగడమే
నిషేదించినారందుకే..
కలెక్షన్లు లేవందుకే...
సరదా సరదా సిగిరెట్టూ
ఇది దొరల్తాగుమరి సిగిరెట్టు
కంపుకొట్టు ఈ సిగరెట్టు
ఇది కాల్చకోయి నా పై ఒట్టు

చరణం:: 4


కవిత్వానికీ సిగరెట్టూ
కాకికే ఇది తోబుట్టూ
పైత్యానికే ఈ సిగరెట్టూ
బడాయికిందా జమకట్టూ
ఆనందానికి సిగరెట్టూ
ఆలోచనలను గిలగొట్టూ
"వాహ్.."పనిలేకుంటే సిగరెట్టూ
తినికూర్చోంటే పొగబెట్టూ
రంగులు రాచే రాకెట్టూ
రంగు రంగులా పాకెట్టూ
కొంపలుకాల్చే సిగరెట్టూ
దీని గొప్ప చెప్పచిరరగొట్టూ

సరదా సరదా సిగిరెట్టూ
ఇది దొరల్తాగుమరి సిగిరెట్టు
కంపుకొట్టు ఈ సిగరెట్టు
ఇది కాల్చకోయి నా పై ఒట్టు

No comments: