Monday, April 02, 2007

రాముడు భీముడు--1964::ఆభేరి::రాగం








సంగీతం::పెండ్యాల నాగేశ్వర రావ్
రచన::కోసరాజు రాఘవయ్య 
గానం: ఘంటసాల,P సుశీల

తారాగణం::N.T.రామారావు,జమున,S.V.రంగారావు,  

రాజనాల,L.విజయలక్ష్మి,శాంతకుమారి,రేలంగి,గిరిజ,రమణారెడ్డి.
రాగం: ఆభేరి 

పల్లవి::

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్..ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ 
తెలిసింది లే తెలిసిందిలే
నెలరాజ నీ రూపు తెలిసిందిలే
తెలిసింది లే తెలిసిందిలే
నెలరాజ నీ రూపు తెలిసిందిలే

చరణం:: 1


చలిగాలి రమ్మంచు పిలిచింది లే
చెలి చూపు నీ పైన నిలిచింది లే
చలిగాలి రమ్మంచు పిలిచింది లే
చెలి చూపు నీ పైన నిలిచింది లే
ఏముంది లే ఇపుడేముంది లే ఏముంది లే ఇపుడేముంది లే
మురిపించు కాలమ్ము ముందుంది లే నీ ముందుంది లే


తెలిసింది లే తెలిసిందిలే
నెలరాజ నీ రూపు తెలిసిందిలే


చరణం:: 2

వరహాల చిరునవ్వు కురిపించవా
పరువాల రాగాలు పలికించవా
అవునందునా కాదందునా అవునందునా కాదందునా
అయ్యరే విధి లీల అనుకోందునా అనుకోందునా


తెలిసింది లే తెలిసిందిలే
నెలరాజ నీ రూపు తెలిసిందిలే


చరణం:: 3


సోగసైన కనులేమో నాకున్నవి
చురుకైన మనసేమో నీకున్నది
కనులేమిటో ఈ కధ ఏమిటో
కనులేమిటో ఈ కధ ఏమిటో
స్రుతి మించి రాగాన పడనున్నది, పడుతున్నది
ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
!! తెలిసింది లే తెలిసిందిలేనెలరాజ నీ రూపు తెలిసిందిలే !!

No comments: