సంగీతం::K.V.మహాదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల , P.సుశీల
తారాగణం::అక్కినేని, లక్ష్మి, జగ్గయ్య,గుమ్మడి,అంజలీదేవి,పద్మనాభం
పల్లవి::
ఒ హో హో..వయ్యారి వగలమారి కుమారీ
వై అర్ యు సారీ..వై కాంట్ యు మారి
యు..నో..నో..నో..
ఒ హో హో..వయ్యారి వగలమారి కుమారీ
వై అర్ యు సారీ..వై కాట్ యు మారీ..
యు..నో..నో..నో..
చరణం::1
నడవకు నడవకు అంతజోరుగా..
నడుస్తాను నీకేం?
నాకేం..హహహా..
నీ అందాలు చందాలు అలసిపోయేను
నడుము నలిగిపోయేనూ
నడవకు నడవకు అంతజోరుగా..
నీ అందాలు చందాలు అలసిపోయేను
నడుము నలిగిపోయేనూ
చూడకు చూడకు అంత కోరగా
నీ చూపులోని ఎరుపునాకు కైపులాగ తోస్తుంది
నన్నేదో చేస్తుంది..అహా
ఒ హో హో..వయ్యారి వగలమారి కుమారీ
వై అర్ యు సారీ..వై కాట్ యు మారీ..
యు..సిల్లి..
చరణం::2
పడుచుదనం మిడిచిపాటు ఎంతకాలము
గడుసువాడు తగిలితే..కాళ్ళబేరమూ
పడుచుదనం మిడిచిపాటు ఎంతకాలము
గడుసువాడు తగిలితే..కాళ్ళబేరమూ
ఈ రుసరుసలూ..గుసగుసలూ..ఎందుకమ్మాయి
ఈ రుసరుసలూ..గుసగుసలూ..ఎందుకమ్మాయి
ఇంక పస ఉంటే వేసుకొందం..రోజూ లడాయి
ప్రతి రోజూ లడాయి
వై అర్ యు సారీ..వై కాట్ యు మారీ..
అబబబభా..
చరణం::3
బిగదీయకు బిగదీయకు పైటకొంగును
ఎంత బిగదీస్తే బిగువులంట బైట పడేను
కౌగిట దాచమనేనూ..
బిగదీయకు బిగదీయకు పైటకొంగును
ఎంత బిగదీస్తే బిగువులంట బైట పడేను
కౌగిట దాచమనేనూ..
ఎగదోయకు ఎగదోయకు కోడె గుండెనూ..
ఎగదోయకు ఎగదోయకు కోడె గుండెనూ..
నీవు ఎగతాళికి చేస్తే అది వెంటబడేను
నీ అంతేదో..చూసేను..ఏయ్..
ఒ హో హో..వయ్యారి వగలమారి కుమారీ
వై అర్ యు సారీ..వై కాట్ యు మారీ..
యు..నో..
No comments:
Post a Comment