Friday, January 05, 2007

బొబ్బిలియుద్ధం--1964




సంగీతం::Sరాజేశ్వర రావ్
రచన::డా.సినారె
గానం::భానుమతి


ఊయల లూగినదోయి మనసే …
తీయని ఊహల తీవెలపైన …
ఊయల లూగినదోయి మనసే …
తీయని ఊహల తీవెలపైన
ఊయల లూగినదోయ

వెన్నెల పూవులు విరిసే వేళ
సన్నని గాలులు సాగే వేళ
వలపులు ఏవో పలికెను నాలో ….
వలపులు ఏవో పలికెను నాలో
తెలుపగ రానిది ఈ హాయి

!! ఊయల లూగినదోయి మనసే
తీయని ఊహల తీవెలపైన
ఊయల లూగినదోయీ !!

కమ్మని రాతిరి రమ్మని పిలిచే
మల్లెల పానుపు మనకై నిలిచే
ప్రాయము నీవై పరువము నేనై ….
ప్రాయము నీవై పరువము నేనై
పరిమళించగా రావోయి…

!! ఊయల లూగినదోయి మనసే
తీయని ఊహల తీవెలపైన
ఊయల లూగినదోయీ !!

No comments: