Friday, January 05, 2007

బొబ్బిలి యుద్ధం--1964::భైరవి::రాగం




సంగీతం::S. రాజేశ్వరరావు
రచన::శ్రీశ్రీ
గానం::P.సుశీల


భైరవి::రాగం 

పల్లవి::

నిను చేర మనసాయేరా నా స్వామీ
చనువార దయసేయరా ఆ ఆ ఆ ఆ

నిను చేర మనసాయేరా నా స్వామీ
చనువార దయసేయరా ఆ ఆ ఆ ఆ

నిను చేర మనసాయెరా...

చరణం::1


విడిదికి రమ్మని చాల వేడితిరా
విడిదికి రమ్మని చాల వేడితిరా
బిడియము నీకేలరా..దొరా
బిడియము నీకేలరా..దొరా

నిను చేర మనసాయెరా..నా స్వామి

చరణం::2

గా గరిగ సాగరిగ..సనిదమప నిదమపా
నిదమపదనిస మపమపదప మనిద మపదనిని నిస

సరసుడవని నిన్నే పదిమంది పొగడా
సరసుడవని నిన్నే పదిమంది పొగడా
మరి మరి కోర్కెలు విరిసెను ప్రియడా
మరి మరి కోర్కెలు విరిసెను ప్రియడా

వయసు నీ కొరకె పలవరించెరా
తనువు నిందలచి పులకరించెరా
మగువ కోర మొగమాటమేలరా
బిగువుమాని జవరాలి నేలరా
సొగసు చూచి ఎదురు కాచి నిలిచి
పగలు రేలు దిగులు చెందు చెలికి

నిను చేర మనసాయేరా నా స్వామీ
చనువార దయసేయరా ఆ ఆ ఆ ఆ

నిను చేర మనసాయెరా..ఆ ఆ ఆ ఆ ఆ

No comments: