Sunday, July 01, 2007

ముత్యాల ముగ్గు--1975




సంగీతన్::K.V.మహాదేవన్
రచన::ఆరుద్ర
గానం::M.బాలమురళీకృష్ణ

తారాగణం::సంగీత,శ్రీధర్,కాంతారావు,ముక్కామల, అల్లు రామలింగయ్య,

రావు గోపాలరావు,హలం,సూర్యకాంతం

:::

శ్రీరామ జయ రామ సీతారామ
శ్రీరామ జయ రామ సీతారామ
కారుణ్యధామా కమనీయనామా
శ్రీరామ జయ రామ సీతారామ
నీ దివ్యనామం మధురాతిమధురం
నేనెన్న తరమా నీ నామ మహిమ
కారుణ్యధామా కమనీయనామా
!!! శ్రీరామ జయ రామ సీతారామ !!!
చరణాలు కొలిచే నగుమోము జూచే
ఆచరణాలు కొలిచే నగుమోము జూచే
సామ్రాజ్యమిచ్చావు సాకేతరామా
భక్తి సామ్రాజ్యమిచ్చావు సాకేతరామా
!!! శ్రీరామ జయ రామ సీతా రామ !!!
నీ కీర్తి చాటగా నా కోసమే నీవు
అవతారమెత్తేవు సుగుణాభిరామా
శ్రీరామ జయ రామ సీతా రామ
కారుణ్యధామా కమనీయనామా
!!! శ్రీరామ జయ రామ సీతా రామ !!!
నిలకడ లేని అల కోతి మూకచే
నిలకడ లేని అల కోతి మూకచే
కడలిపై వారధి కట్టించినావే
పెను కడలిపై వారధి కట్టించినావే
నీ పేరు జపియించ తీరేను కోర్కెలు
నీ పేరు జపియించ తీరేను కోర్కెలు
నేనెంత నుతియింతు నా భాగ్య గరిమ
శ్రీరామ జయ రామ సీతారామ
కారుణ్యధామా కమనీయనామా
!!! శ్రీరామ జయ రామ సీతారామ !!!

2 comments:

Dr.Suryanarayana Vulimiri said...

Music Director: K.V.Mahadevan
Lyrics: Arudra

Dr.Suryanarayana Vulimiri said...

Music Director: K.V.Mahadevan
Lyrics: Arudra