Sunday, July 01, 2007

ముత్యాల ముగ్గు--1975




సంగీతం::K .V. మహదేవన్
రచన::గుంటూరు శేసేంద్ర శర్మ
గానం::P.సుశీల

తారాగణం::సంగీత,శ్రీధర్,కాంతారావు,ముక్కామల, అల్లు రామలింగయ్య,
రావు గోపాలరావు,హలం,సూర్యకాంతం

::::

నిదురించే తోటలోకి..పాట ఒకటి వచ్చిందీ
కన్నుల్లో నీరు తుడిచి..కమ్మటి కల ఇచ్చింది
నిదురించే తోటలోకి..పాట ఒకటి వచ్చిందీ
కన్నుల్లో నీరు తుడిచి..కమ్మటి కల ఇచ్చింది

::::1


రమ్యంగా కుటీరాన..రంగవల్లులల్లిందీ
దీనురాలి గూటిలోన..దీపంగా వెలిగిందీ
రమ్యంగా కుటీరాన..రంగవల్లులల్లిందీ
దీనురాలి గూటిలోన..దీపంగా వెలిగిందీ
శూన్యమైన వేణువులో..ఒక స్వరం కలిపి నిలిపిందీ
శూన్యమైన వేణువులో..ఒక స్వరం కలిపి నిలిపిందీ
ఆకు రాలు అడవికి..ఒక ఆమని దయ చేసిందీ

నిదురించే తోటలోకి..పాట ఒకటి వచ్చిందీ
కన్నుల్లో నీరు తుడిచి..కమ్మటి కల ఇచ్చింది

::::2


విఫలమైన నా కోర్కెలు..వేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినపడీ..అంతలో పోయాయి
విఫలమైన నా కోర్కెలు..వేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినపడీ..అంతలో పోయాయి
కొమ్మల్లో పక్షుల్లారా..గగనంలో మబ్బుల్లారా
నది దోచుకు పోతున్న..నావను ఆపండి..ఈ..
రేవు బావురుమంటోందని.......
నావకు చెప్పండి..నావకు చెప్పండి
నావకు చెప్పండి..నావకు చెప్పండి


Mutyala Muggu--1975
Music::K.V.Mahadevan
Lyricis::Gunturu Seshendra sharma
Singer::P.Susheela

nidurinche totaloki paata okati vachindi
kannullo neeru tudichi kammati kala vachindi

nidurinche totaloki paata okati vachindi
kannullo neeru tudichi kammati kala vachindi


ramyamgaa kuteerana rangavalluladdindi
deenurali gutilona deepamga veligindi

ramyamgaa kuteerana rangavalluladdindi
deenurali gutilona deepamga veligindi

shunyamaina venuvulo oka swaram kalipi nilipindi
shunyamaina venuvulo oka swaram kalipi nilipindi
aakuraalu adaviki oka aamani daya chesindi

viphalamaina na korkelu velade gummamlo
aashala adugulu vinabadi antalo poyayi

viphalamaina na korkelu velade gummamlo
aashala adugulu vinabadi antalo poyayi

kommallo pakshullaraa gaganamlo mabbullaraa
nadi dochukupotunna navanu aapandi

revu bavurumantondani naavaku cheppandi

No comments: