Thursday, July 26, 2007

కాలం మారింది--1972




సంగీతం::S.రాజేశ్వర రావ్
రచన::దాశరధి
గానం::V.రామకృష్ణ,బృందం

తారాగణం::శోభన్‌బాబు,శారద,గుమ్మడి,అంజలీదేవి,చంద్రమోహన్,సూర్యకాంతం,గీతాంజలి,అల్లురామలింగయ్య.

పల్లవి::

విగ్రహాలను..ప్రతిష్ఠించమని
వీధులకు తమ పేర్లు పెట్టమని
మన నాయకులెవరు..అనలేదండి
ఈ ఆలోచనలు..మనవేనండి
నిజం తెలుసుకోండి..ఈ..ఈ..
నిజం తెలుసుకోండి..యువకుల్లారా ఓ యువకుల్లరా
ఈ నిజం తెలుసుకోండి..

చరణం::

పేదల పాలిటి పెన్నిధి గాంధీ..ఈ..
పేదల పాలిటి పెన్నిధి గాంధీ
దీనుల పాలిటి దేవుడు గాంధీ
దీనుల పాలిటి దేవుడు గాంధీ
అంతరానితనమై పీడించే..అంటువ్యాధికే వైద్యుడు గాంధీ
అతని దారిలో నడవండి..అతనికి శాంతిని చేకూర్చండి
నిజం తెలుసుకోండి..ఈ..ఈ..ఈనిజం తెలుసుకోండి

చరణం::1

స్వాతంత్ర్య భారత..సారధి నెహ్రు
తూర్పు పడమరల..వారధి నెహ్రు
శాంతి విధాత జాతికి నేత
సామ్యవాద సంధాత నెహ్రు
అతని బాటలో నడవండి..అతని ఆశలు తీర్చండి
నిజం తెలుసుకోండి..ఈ ఈ ఈ..ఈ నిజం తెలుసుకోండి

చరణం::2

ఆంధ్రకేసరి ప్రకాశము
ఆంగ్లేయులకు..సింహ స్వప్నము..సింహ స్వప్నము
అతని జీవితం త్యాగమయం..త్యాగమయం
ఆంధ్రుల ఐక్యత..అతని ఆశయం..అతని ఆశయం
అతని దారిలో నడవండి..ఆంధ్రుల పేరు నిలపండి
ఆంధ్రుల పేరు నిలపండి....

చరణం::3

వీరనారి మన ఇందిర
అహ విజయ..శంఖమూదిందిరా
మన స్వాతంత్ర్యాన్ని..హరించ జూచిన
శత్రులను అణిచిందిరా....
బంగ్లా జాతిని బానిసత్వము..బారినుండి కాచిందిరా
ఇందిర మన ఇందిర..ఇందిర మన ఇందిర

చరణం::4

మన నాయకులు కోరింది..వెండి విగ్రహాలా
ఊళ్ళకు పేర్లా..కాదు

కులమత బేధం లేని సమాజం..భారతదేశం
ధనికుడు పేద లేని సమాజం..భారతదేశం
దోపిడీ రాపిడి లేని సమాజం..భారతదేశం
ద్రోహం మోసం లేని సమాజం..భారతదేశం
భారతదేశం ఒకటే ఒకటని..ప్రపంచ మంతట చాటాలి
వీర నాయకుల వారసులమని..పేరు ప్రతిష్టలు తేవాలి
వారి కలలన్ని నిజము కావాలి..


Kaalam Maarindi--1972
Music::S.Rajeswara rao
Lyricis::Dasarathi 
Singer's::V,Ramakrishna,Brundam

:::

Vigrahaalanu pratistinchamani
veedhulaku tama perlu pettamani
mana naayakulevaru analedandi
ee alochanalu manavenandi
nijam telusukondi..
nijam telusukondi yuvakullaaraa oo yuvakullaraa

pedala paliti pennidhi gandhi
pedala paliti pennidhi gandhi
deenula paliti devudu gandhi
deenula paliti devudu gandhi
antaranitanamai peedinche antuvydhike vaidyudu gandhi
atani darilo nadavandi ataniki shantini chekurchandi..
nijam telusukondi...

swatantrya bharata saradhi nehru
turpu padamarala varadhi nehru
shanti vidhaata jaatiki neta
saamyavaada sandhaata nehru
atani batalo nadavandi atani aashalu teerchandi
nijam telusukondi...

andhrakesari prakashamu
angleyulaku simha swapnamu
atani jeevitam tyagamayam
andhrula aikyata atani aashayam
atani darilo nadavandi andhrula peru nilapandi

veeranaari mana indira
aha vijaya shankhamudindiraa
mana swatantryaanni harincha juchina
shatrulanu anichindiraa
banglaa jaatini banisatvamu barinundi kaachindiraa
indira mana indira
banglaa jaatini banisatvamu barinundi kaachindiraa
indira mana indira

mana nayakulu korindi vendi vigrahaalaa
uullaku perlaa...kaadu

kulamata bedham leni samaajam bharatadesham
dhanikudu peda leni samaajam bharatadesham
dopidi rapidi leni samaajam bharatadesham
droham mosam leni samaajam bharatadesham
bharatadesham okate okatani prapanchamantata chaataali
veera naayakula vaarasulamani peru pratistalu tevali

vari kalalanni nijamu kaavaali...

No comments: