Wednesday, June 13, 2007

నిత్యకళ్యాణం పచ్చతోరణం..1960

 


సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు

రచన::ఆరుద్ర

గానం::P.B.శ్రీనివాస్,జిక్కి

Directed by:: pinisetti Sree Raamamoorti   

తారాగణం::చలం,రామకృష్ణ,కృష్ణకుమారి,C.S.R.గుమ్మడి,అల్లురామలింగయ్య,సంధ్య,హేమలత,రాజశ్రీ,సూర్యకాంతం,రమణారెడ్డి,


పల్లవి::


అసలు నీవు రానేలా..అంతలోనె పోనేలా

మనసు దోచి చల్లగ జారే..పిల్లదానా ఆగవేలా

పిలదాన ఆగవేలా


ఇపుడు వెంట పడకోయి..మరల రేపు కలదోయీ

పరులు చూడ మంచిది కాదు..పిల్లవాడా చాలునోయి

పిలవాడ చాలునోయి


చరణం::1


పారిపోవు లేడిపిల్ల..ప్రాణమింక నిలచుట కల్ల

పారిపోవు లేడిపిల్ల..ప్రాణమింక నిలచుట కల్ల

మాట వినక పోయేవంటే..మనకు మనకు ఇదిగో డిల్ల


అసలు నీవు రానేలా..అంతలోనె పోనేలా

మనసు దోచి చల్లగ జారే..పిల్లదానా ఆగవేలా

పిలదాన ఆగవేలా


అల్లరింక చేయవద్దు..అయినదోయి చాలా పొద్దు

అల్లరింక చేయవద్దు..అయినదోయి చాలా పొద్దు 

దేనికైన ఉండాలోయి..తెలుసా తెలుసా కొసకో హద్దు


ఇపుడు వెంట పడకోయి..మరల రేపు కలదోయీ

పరులు చూడ మంచిది కాదు..పిల్లవాడా చాలునోయి

పిలవాడ చాలునోయి


చరణం::2


కలసి మెలసి ఉన్నావంటే..కలుగు నీకు ఎంతో పుణ్యం

కలసి మెలసి ఉన్నావంటే..కలుగు నీకు ఎంతో పుణ్యం

విడిచిపెట్టి పోయావంటే..వెలుగే తొలగి బతుకే శూన్యం


అసలు నీవు రానేలా..అంతలోనె పోనేలా

మనసు దోచి చల్లగ జారే..పిల్లదానా ఆగవేలా

పిలదాన ఆగవేలా


నీవు పైకి చెప్పే బాధ..మనసులోన నాకూ లేదా

నీవు పైకి చెప్పే బాధ..మనసులోన నాకూ లేదా

మనకు అడ్డమేదీ రాదూ..మనసు మనసు ఒకటే కాదా


ఇపుడు వెంట పడకోయి..మరల రేపు కలదోయీ

పరులు చూడ మంచిది కాదు..పిల్లవాడా చాలునోయి

పిలవాడ చాలునోయి   

No comments: