Wednesday, January 31, 2007

ఖైదీ బాబాయ్ --1974



)

సంగీతం::K.V.మహాదేవన్
రచన::C.నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల,S.జానకి
Director::T Krishna
Producer::T.Babul Nath, J.Lakshmana Rao
Cast::Sobhan Babu, Vanisri, Sowcar Janaki

ఓరబ్బీ చెపుతాను...ఓలమ్మీ చెపుతాను
పండగ పూట ఒక నిండునిజం చెపుతాను
ఏంచెపుతావూ....వాడు పగవాడుకాదు మంచి మగవాడని 2
ఓలమ్మీ చెపుతాను ఓలమ్మీ చెపుతాను
పచ్చాని పైరుమీద బాసచేసి చెపుతాను
ఏం చెపుతావుఇది పల్లెకాదు చల్లని రేపల్లెయని 2

ఓరబ్బీ చెపుతానుఓలమ్మీ చెపుతాను

చెడ్డపనికి వుంటుంది చెరసాలశిక్ష
మంచిపనికి వుంటుంది మరోరకం శిక్ష
ఈ శిక్ష నీకు వేసి మాకక్షతీర్చుకోంటే...2
నీ వేమంటావూ......నా యాల్దియి
శిక్షయే శ్రీరామ రక్షయని
ఈ చెరసాలే మరుజన్మకు వుండాలనికోరుకొంటానూ ఇంకేమంటాను

ఓరబ్బీ చెపుతానుఓలమ్మీ చెపుతాను

ఈ పల్లెనన్ను మన్నించి తనవాడంటున్నది
ఒక తల్లి మనసు నన్నింక పగవాడనుచున్నది ఈ పల్లె
ఈతప్పు ఎవరిదంటే ఇదితప్పేలేదంటేనువ్వేమంటావూ...
ఓలమ్మో.... ఇది విధిచేతిలో వింతవేటయనిదీని తుదిగెలుపు నీదినాది కానేకాదనిఅనుకొంటానూ.... ఇంకేమంటానూ....

ఓరబ్బీ చెపుతానుఓలమ్మీ చెపుతాను

No comments: