సంగీతం::పెండ్యాల నాగేశ్వర రావ్
రచన::పింగళి ఆత్రేయ
గానం::P.శాంతకుమారి
రాగం:పీలు
ఎన్నాళ్ళనినా కన్నులు కాయగ
ఎదురు చూతురా గోపాలా
ఎంతపిలచినా ఎంత వేడినా
ఈనాటికి దయ రాదేలా
గోపాలా నంద గోపాలా గోపాలా నంద గోపాలా
వీనులవిందుగ వేణుగానమూ
వినితరించగా వేచితిరా ఆ....ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
వీనులవిందుగ వేణుగానమూ వినితరించగా వేచితిరా
వేచి వేచి వెన్నముద్దవలే
కరిగిపోయరా నా బ్రతుకు
కరిగి పోయరా నాబ్రతుకూ....
ఎన్నాళ్ళనినా కన్నులు కాయగ
ఎదురు చూతురా గోపాలా
వెన్నమీగడలు జున్నుపాలకు
ఏమి కొరతరా మనఇంటా
..ఆ....ఆ....ఆ..ఆ..ఆ.ఆ..ఆ....
వెన్నమీగడలు జున్నుపాలకు
ఏమి కొరతరా మన ఇంటా..
పాలను ముచ్చిలి పరుల చేతిలో
దెబ్బలు తినకురా కన్నయ్యా
ఈ తల్లి హౄదయమూ ఓర్వలేదయా
ఎన్నాళ్ళనినా కన్నులు కాయగ
ఎదురు చూతురా గోపాలా
వెన్నమీగడలు జున్నుపాలకు
ఏమి కొరతరా మన ఇంటా..
పాలను ముచ్చిలి పరుల చేతిలో
దెబ్బలు తినకురా కన్నయ్యా
ఈ తల్లి హౄదయమూ ఓర్వలేదయా
ఎన్నాళ్ళనినా కన్నులు కాయగ
ఎదురు చూతురా గోపాలా
3 comments:
శక్తి గారు, ఈ పాట సాహిత్యంలో కొన్ని తప్పులు దొర్లాయి. వీటిని సవరించ గలరు. అవి ఈ దిగువన వ్రాస్తున్నాను.
పల్లవి: మొదటి లైను "ఎన్నాళ్ళనిన" కు బదులు "ఎన్నాళ్ళని నా"; మూడవ లైను లో "పిలిచినా" కు బదులు "పిలచినా" ఉండాలి. మొదటి చరణం: "వీనుల విందగు" కు బదులు "వీనుల విందుగ"; "నిను తరించగ వేడితిరా" కు బదులు "విని తరించగా వేచితిరా" అని ఉండాలి. రెండవ చరణం: మొదటి, మూడవ లైనులు - "మీగడల" కు బదులు "మీగడలు"; ఐదవ లైను - "వెన్నలు దొంగిల పరుల ఇంటిలో" కు బదులు "పాలను ముచ్చిలి పరుల చేతిలో" అని ఉండాలి; ఐదు, ఆరు లైనులు మళ్ళీ రిపీట్ అవుతాయి.

నమస్తే సూర్యనారాయణ గారూ
ఓ....సో..థాంక్యు వెరీమచ్ సార్..
మీరు చెప్పినవి correct చేసేసాను
మీ అభిమానానికి నా కృతజ్ఞతలు
ప్రేమతో శక్తి
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
ఆ మధ్య మీ బ్లాగులో కాలు పెట్టి మళ్ళి వెనక్కు వచ్చేసాను
ఏదో పాట సర్చ్ చేస్తే మీ బ్లాగ్ లింక్ వచింది తీరా చూస్తే
అది మీ బ్లాగు..మీ ఫోటో చూసి గుర్తుపట్టాను మళ్ళి తీరిగ్గా
దర్శించుకొందాం మీ బ్లాగును అని ఏమీ చదవకనే వచ్చేసాను
Post a Comment