సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటసాల, పి.సుశీల
భీంపలాస్::రాగం
పల్లవి::
కలగా కమ్మని కలగా
మన జీవితాలు
మనవలెగా
కలగా కమ్మని కలగా
అనురాగమే
జీవన జీవముగా
ఆనందమె
మనకందముగా
కలగా కమ్మని కలగా
చరణం::1
రాగవశమున మేఘమాలిక
మలయ పవనుని కలిసి తేలగా...ఆ...ఆ...ఆ...ఆ...
ఆ...కొండను తగిలి గుండియ క రిగి
నీరై ఏరై పారునుగా
కలగా కమ్మని కలగా
మన జీవితాలే ఒక కలగా
కలగా కమ్మని కలగా
చరణం::2
వెలుగు చీకటుల కలబోసినవి
కాలము చేతిలో
కీలుబొమ్మలం
భావనలోనే
జీవనమున్నది
మమతే జగతిని నడుపునది (2)
కలగా కమ్మగా కలగా
చరణం::3
తేటికోసమై
తేనియ దోచే
విరి కన్నియకా సంబరమేమో
వేరొకరిని చేరిన ప్రియుని
కాంచినప్పుడా కలత ఏమిటో
ప్రేమకు శోకమే ఫలమేమో
రాగము త్యాగము జతలేమో
కలగా కమ్మగా కలగా...ఆ...ఆ...
No comments:
Post a Comment