Thursday, December 21, 2006

స్వర్గ సీమ--1945



సంగీతం::నాగయ్య-ఓగిరాల 
రచన::సముద్రాల సీనియర్
గానం::ఘంటసాల-భానుమతి


నటీ,నటులు::నాగయ్య,భానుమతి

భానుమతి గారి తో కలిసి ఘంటసాల గారు పాడిన మొదటి పాట

స్వర్గసీమ చిత్రం లోని యుగళగీతం తో
ఘంటసాల గారి జీవితనౌక ప్రారంభమైనదని చెప్పాలి
ఆంధ్రుల గుండెలో చిరకాలం ఉండిపోయిన ఘంటసాలవారి
మృధుమధురమైన స్వర తరంగాలు ఈ నాటికీ అందరి చెవుల్లో
మారుమ్రోగుతున్నాయంటే అది అతిసయోక్తి కాదు

మీకు ఈ పాట నచ్చితే వినండి


ఆమె::--ఆ...ఆ.ఆ.ఆ. రాజా -- ఓహో నా రాజా
అహా..నా రాజా -- రావో.. మా రాజా
రావో మా రాజా -- ఓహో..నా రాజా

అతడు::--అరె హా..ఆ..
ఏ యెన్నెల చిరునవ్వుల యిరజిమ్ము బఠాణీ..2
నీ రాకకోరి -- నీ దారి కాచి ఉన్నానే..2
నీకై వేచి ఉన్నానే -- పిల్లా కల్సుకున్నానే

ఆమె::--చాలులె పోరా -- చాలులేరా మాయలమారీ..2
నీ దారి -- నీ జాడ కనగోరి, ఏకాకిగా నేజారి బేజారైతిరా

అతడు::--ఓ నా చిట్టి చిలకా ఎంతలిసిపోతివే..అయ్యో.
ఆమె::--అహా.
అతడు::--చిట్టి చిలకా ఎంతలిసిపోతివే ..పిల్లా
ఆమె::--వయ్యారి బావ వగలింక చాలుగాని పోరా..2
అతడు::--ఆ..నా రాణి
ఆమె::--ఆ..నా రాజా
అతడు::--ఆ..నా రాణి
ఆమె::--ఆ..నా రాజా
ఇద్దరు::--పాడుకుందామా జతగా ఆడుకుందామా..2
అతడు::--లల్ల లల్ల లల్లల్లల లల్లలా
ఆమె::--ల ల ల ల ల ల ల ల లల్లల్లల్లలలల్లలా
అతడు::--ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ల ల్ల లల్ల లల్లాలాలల్లల్లలా
ఆమె::--ల ల ల ల ల ల లల్లల్లాలా లల్ల లల్లలా
ఆ..ఆ..ఆ.
అతడు::--తక్క ధీం తక్క ధీం
ఆమె::--ఆ...ఆ...
అతడు::--తక్క ధీం తక్క ధీం
ఆమె::--ట ట టా ట ట టా ట ట టా ట ట టా

Saturday, December 16, 2006

పాండవ వనవాసం--1965::రాగం: తిలంగ్



రాగం : తిలంగ్
రచన::సముద్రాలరాఘవాచార్య(సీనియర్) 
సంగీతం::ఘంటసాల

గానం::ఘంటసాల,P.సుశీల


నా చందమామ నీవె భామా తారల..ఆ..న నీనీడనే నా ప్రేమసీమా ఆ...
నీనీడనే నా ప్రేమసీమా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆనీకంఠ వీణా రాగాలు తీయా...నీకన్నుదోయీ... మోహాలు పూయా...నీకంఠ వీణా రాగాలు తీయా...నీకన్నుదోయీ... మోహాలు పూయా...
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీకంఠ వీణా రాగాలు తీయా...నీకన్నుదోయీ... మోహాలు పూయా...

నీపాద మంజీరాల నా ప్రేమ మ్రోయా
నటియించరావే మెరుపుతీగాహాయిగా ఆఅ ఆ ఆ ఆ అ ఆ నాఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆఎలకోయిల గొంతుమూయ ఎలుగెత్తి పాడవే
ఆ అ అ అ అ అ అ అ
వనమయూరి పరువు మాయ వలపు నాట్యమాడవే
అడుగడుగున లయలు చిలికి హొయలు చిలికి ఏలవె
ప్రేమ మథుర శిల్ప చిత్ర రేఖా శశిరేఖా
ఆ అ అ అ అ అ అ అ

Thursday, December 14, 2006

భూకైలాసం--1958::షన్ముఖప్రియ::రాగం



గానం::M.L.వసంతకుమారి
సంగీతం::R.సుదర్శనం
రచన::Sr.సముద్రాల
ఫ్రొడుసర్::AV. మెయ్యప్పన్
డైరెక్టర్::K.శంకర్


రాగం::షన్ముఖప్రియ !!

మున్నీట పవళించు నాగ శయన
మున్నీట పవళించు నాగ శయన
చిన్నారి దేవేరి సేవలుచేయ
మున్నీట పవళించు నాగ శయన

నీనాభి కమలాన కొలువు చేసే
నీనాభి కమలాన కొలువు చేసే వాణిసు భుజపీటి బరువువేసి
వాణిసు భుజపీటి బరువువేసి
మున్నీట పవళించు నాగ శయన

మీనా కౄతి దాల్చినావు వేదాల రక్షింప
మీనా కౄతి దాల్చినావు
కూర్మా కౄతి బూనినావు వారిధి మధియింప
కూర్మా కౄతి బూనినావు
శిబి రూపము దాల్చినావు కడ శాసుర విధియింప
శిబి రూపము దాల్చినావు
నరసింహమై వెలసినావు ప్రహ్లాదు రక్షింప
నరసింహమై వెలసినావు

నరసింహమై వెలసినావు
సతపాల మమునేల జాగేల
సతపాల మమునేల జాగేల పాల
మున్నీట పవళించు నాగ శయన

మొహిని విలాస కలిత నవమొహన
మొహదూర మౌనిరాజ మనోమొహన
మొహిని విలాస కలిత నవమొహన
మొహదూర మౌనిరాజ మనోమొహన
మందహాస మధురవదన రమానాయక
మందహాస మధురవదన రమానాయక
కోటిచంద్ర కాంతి సదన శ్రీలోల పాల
మున్నీట పవళించు నాగ శయన

Tuesday, December 12, 2006

పాండవ వనవాసం--1965






సంగీతం::ఘంటసాల
రచన::శ్రీ సముద్రాల రాఘవాచార్య
గానం::ఘంటసాల,బృందం


చక్రవాక::రాగం
{ ఆహిర్ భైరవ్ హిందుస్తానీ రాగ్ }

సాకీ::
న్యాయానికే పరాజయమా!
వంచనకే ధర్మము తలవంచేనా

బృందం::ఆ.. ఆ.. ఆ.. ఆ..

పల్లవి::

విధి వంచితులై విభవము వీడి
అన్నమాట కోసం అయ్యో.....అడవి పాలయేరా
విధి వంచితులై విభవము వీడి
అన్నమాట కోసం అయ్యో.....అడవి పాలయేరా

చరణం::1

నీ మది రగిలే కోపానలము
ఈ మహినంతా దహియించేనని
మోమును దాచేవ ధర్మరాజా

బృందం::అయ్యో....అడవి పాలయేరా

చరణం::2

సభలో చేసిన శపథముదీరా
పావుల నదిలో త్రుంచెదనేనని
బాహువులూచేవా భీమసేనా!

బృందం: ఆహా…అడవి పాలయేరా

చరణం::3

ఆలములోన కౌరవసేన
అమ్ములవానా ముంచెదనేనని
ఇసుమును చల్లేవ సవ్యసాచి

విధి వంచితులై విభవము వీడి
అన్నమాట కోసం అయ్యో....అడవి పాలయేరా

చరణం::4
ఏ యుగమందూ ఏ ఇల్లాలు
ఎరుగదు తల్లీ ఈ అవమానం
ఏ యుగమందూ ఏ ఇల్లాలు
ఎరుగదు తల్లీ ఈ అవమానం
నీ పతి సేవయె నీకు రక్ష

బృందం: ఆహా…..

Thursday, December 07, 2006

పాండవ వనవాసం--1965::రాగం:-ద్విజావంతి


సంగీతం::ఘంటసాలవేంకటేశ్వరరావు 
రచన::సముద్రాలరాఘవాచార్య(సీనియర్) 
గానం::సుశీల,ఘంటసాల 
తారాగణం::N.టి.రామారావు,S.V.రంగారావు,సావిత్రి,గుమ్మడి,హరనాధ్,
రాజనాల,కాంతారావు,L.విజయలక్ష్మి,సంధ్య.

రాగం:-ద్విజావంతి

ద్విజావంతి రాగం లో అద్భుతంగా ఆలపించిన
మన ఘంటసాల గారీ తో కలసి పాడిన సుశీలమ్మ గారి
మరో ఆణిముత్యం విని తీరాల్సిందే మీరంతా :)

హిమగిరి సొగసులు మురిపించును మనసులు
చిగురించు నేవొ ఏవొ ఊహలు
హిమగిరి సొగసులు

1)యోగులైనా మహాభొగులైనా మనసుపడే మనొఙసీమ
సురవరులు సరాగాల చెలులకలసి సొలసే అనురాగసీమ
హిమగిరి సొగసులు

2)ఈ గిరినే ఊమాదేవి హరుని సేవించి తరించెనేమో
సుమశరుడు రతీదేవి జేరికేళి తేలి లాలించెనేమో
హిమగిరి సొగసులు

Wednesday, December 06, 2006

సీతారామకల్యాణం--1961::మధ్యమావతి:::రాగం



రచన::సముద్రాల రాఘవాచార్య  సీనియర్
సంగీతం::గాలిపెంచల నరసింహా రావ్
గానం::P. సుశీల బౄందం

రాగం::మధ్యమావతి

సీతారాముల కళ్యాణం చూతమురారండి
శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి
సిరికళ్యాణపు బొట్టును పెట్టి
బొట్టును పెట్టి
మణి బాసికమును నుదుటను కట్టి
నుదుటను కట్టి
పారాణిని పాదాలకు పెట్టి ఆ ఆ అ ఆ ఆ అ ఆ ఆ
పారాణిని పాదాలకు పెట్టి
పెళ్ళికూతురై వెలసిన సీతా
కళ్యాణం చూతమురారండి
శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి

సంపగి నూనెను కురులను దువ్వి
కురులను దువ్వి
సొంపుగ కస్తూరి నామము తీర్చి
నామము తీర్చి
చెంపగవాకి చుక్కను పెట్టి ఆ ఆ ఆ ఆ ఆ అ అ
చెంపగవాకి చుక్కను పెట్టి
పెళ్ళికొడుకై వెలిసిన రాముని
కళ్యాణం చూతమురారండి
శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి

జానకి దోసిట కెంపుల ప్రోవై
కెంపుల ప్రోవై
రాముని దోసిట నీలపురాశై
నీలపురాశై
ఆణిముత్యములు తలంబ్రాలుగా ఆ ఆ ఆ అ అ ఆ ఆ
ఆణిముత్యములు తలంబ్రాలుగా
ఇరవుల మెరిసిన సీతారాముల
కళ్యాణం చూతమురారండి
శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి

Tuesday, December 05, 2006

శ్రీ వేంకటేశ్వర మహత్యం--1954::రాగం::రీతి గౌళ



" రీతిగౌళ రాగం "

ఆత్రేయ గారు రచనలో , పెండ్యాల నాగేశ్వర రావు గారు స్వరపరచగా " రీతిగౌళ రాగం " లో ఘంటసాల గారు పాడిన ఈ పాట మధురమైన సంగీతంలో మరపురాని సాహిత్యం లా మనోభావాలను ఉల్లాసపరిచే పాటను మీరొక్కసారి విని తీరాల్సిందే :)


రాగం:రీతి గౌళ


శేషశైలావాసా శ్రీవేంకటేశాశయనించు మా అయ్య శ్రీ చిద్విలాసా

రాగం:ఆనంద బైరవి

శ్రీదేవి వంకకూ చిలిపిగా చూడకు అలమేలుమంగకూ అలుకరానీయకు

ముద్దు సతులిద్దరినీ ఇరువైపులా జేర్చిమురిపించి లాలించి ముచ్చటల తేల్చి

శేషశైలావాసా


రాగం:ఆనంద బైరవి

పట్టు పానుపు పైనా పవ్వళించర స్వామీ భక్తులందరు నిన్ను ప్రస్తుతించి పాడ
చిరునగవు లొలుకుచూ నిదురించు నీ మోమూ 2
కరువు తీరా గాంచి తరియింతుమూ మేము

శేషశైలావాసా

Monday, December 04, 2006

విమల--1960::వరాళి::రాగం


)


సంగీతం::SM.సుబ్బయ్య నాయుడు
రచన::ముద్దు క్రిష్ణ
గానం::రాధా జయలక్ష్మి

రాగం :: వరాళి

కావవే అమ్మా దేవీ నిను పూజాసేతునే
దయ కావవే అమ్మా దేవీ పూజాసేతునే
నన్ను కావవే అమ్మా దేవీ నును పూజాసేతునే
శివును సతి నీవే గతి
కావవే అమ్మా దేవీ నిను పూజాసేతునే
శివును సతి నీవే గతి
కావవే..ఏ..ఏ..

నీ పాదకమలములు సదా..ఆ..ఆ..
నీ పాదకమలములు సదా మది దేవీ నమ్మితి
కరుణ గనవే మాతా
నీ పాదకమలములు సదా మది దేవీ నమ్మితి
కరుణ గనవే మా
కడు దీనురాల కనవే నా
ఓ భవహారి పరమ కౄపాకరీ

నన్ను కావవే అమ్మా దేవీ నిను పూజాసేతునే
శివును సతి నీవే గతి
కావవే..ఏ..ఏ...

జీవితలతలే సుమములుగని
నాదగు బాధలే తీరేనే
మాతా భువిపై నీవే సకలమని
మది గని తలతు శివురాణీ
ఈ లోకము వొడిదుడుకులు గడుప
ఇలలో మాకుల దేవతవే
ఈ లోకము వొడిదుడుకులు గడుప
ఇలలో మాకుల దేవతవే
శ్రీ రాజరాజేశ్వరీ సేతు
నీకే నమతులెన్నో దయానిధి

కావవే అమ్మా దేవీ నిను పూజాసేతునే
శివును సతి నీవే గతి
కావవే..ఏ..ఏ...

విమల--1960::రాగమాలిక







గానం::ఘంటసాల,రాధా జయలక్ష్మి
రచన::ముద్దు క్రిష్ణ
సంగీతం::సుబ్బై నాయుడు ( నైడు) SM.

రాగం::రాగమాలిక

రాగం::పహడీ (యదుకుల కాంభోజి)


కన్నుల్లో నీ బొమ్మ చూడు
నా కన్నుల్లో నీ బొమ్మ చూడు
అది కమ్మని పాటలు పాడు....
నా కన్నుల్లో నీ బొమ్మ చూడు
అది కమ్మని పాటలు పాడు...
కన్నుల్లో నీ బొమ్మ చూడు

రాగం:::రాగేశ్రీ!!


పున్నమి వెన్నెల వన్నెలలో
కన్నుల కట్టిన రూపముతో
నీవే మనసున తోచగా..ఆ..ఆ
నీవే మనసున తోచగా
నను నేనే మరచిపోదురా...

కన్నుల్లో నీ బొమ్మ చూడు
అదికమ్మని పాటలు పాడు..
కన్నుల్లో నీ బొమ్మ చూడు

రాగం:::మిశ్రతిలంగ్!!


కోయిల పాటల తీరులలో..ఓ...
కోయిల పాటల తీరులలో
సరిపోయిన రాగాలల్లుదమా
సరిపోయిన రాగాలల్లుదమా
నచ్చిన పూవుగద నేను
నచ్చిన పూవుగద నేను...
కోరివచ్చిన తుమ్మెద నీవేరా...

కన్నుల్లో నీ బొమ్మ చూడు
నా కన్నుల్లో నీ బొమ్మ చూడు

రాగం:::కాఫీ!!


రాగమాలికల వీణనీవే..ఏ..ఏ..ఏ..
రాగమాలికల వేణనీవే.
అనురాగములేలే జాణవేలే
అనురాగములేలే జాణవేలే
నీవే వలపుల జాబిలిరా..
నీవే వలపుల జాబిలిరా..
మరినేనే కులుకుల వెన్నెలరా..

కన్నుల్లో నీ బొమ్మ చూడు
నా కన్నుల్లో నీ బొమ్మ చూడు
అది కమ్మని పాటలు పాడు....
కన్నుల్లో నీ బొమ్మ చూడు...
నా కన్నుల్లో నీ బొమ్మ చూడు