సంగీతం::నాగయ్య-ఓగిరాల
రచన::సముద్రాల సీనియర్
గానం::ఘంటసాల-భానుమతి
నటీ,నటులు::నాగయ్య,భానుమతి
భానుమతి గారి తో కలిసి ఘంటసాల గారు పాడిన మొదటి పాట
స్వర్గసీమ చిత్రం లోని యుగళగీతం తో
ఘంటసాల గారి జీవితనౌక ప్రారంభమైనదని చెప్పాలి
ఆంధ్రుల గుండెలో చిరకాలం ఉండిపోయిన ఘంటసాలవారి
మృధుమధురమైన స్వర తరంగాలు ఈ నాటికీ అందరి చెవుల్లో
మారుమ్రోగుతున్నాయంటే అది అతిసయోక్తి కాదు
మీకు ఈ పాట నచ్చితే వినండి
ఆమె::--ఆ...ఆ.ఆ.ఆ. రాజా -- ఓహో నా రాజా
అహా..నా రాజా -- రావో.. మా రాజా
రావో మా రాజా -- ఓహో..నా రాజా
అతడు::--అరె హా..ఆ..
ఏ యెన్నెల చిరునవ్వుల యిరజిమ్ము బఠాణీ..2
నీ రాకకోరి -- నీ దారి కాచి ఉన్నానే..2
నీకై వేచి ఉన్నానే -- పిల్లా కల్సుకున్నానే
ఆమె::--చాలులె పోరా -- చాలులేరా మాయలమారీ..2
నీ దారి -- నీ జాడ కనగోరి, ఏకాకిగా నేజారి బేజారైతిరా
అతడు::--ఓ నా చిట్టి చిలకా ఎంతలిసిపోతివే..అయ్యో.
ఆమె::--అహా.
అతడు::--చిట్టి చిలకా ఎంతలిసిపోతివే ..పిల్లా
ఆమె::--వయ్యారి బావ వగలింక చాలుగాని పోరా..2
అతడు::--ఆ..నా రాణి
ఆమె::--ఆ..నా రాజా
అతడు::--ఆ..నా రాణి
ఆమె::--ఆ..నా రాజా
ఇద్దరు::--పాడుకుందామా జతగా ఆడుకుందామా..2
అతడు::--లల్ల లల్ల లల్లల్లల లల్లలా
ఆమె::--ల ల ల ల ల ల ల ల లల్లల్లల్లలలల్లలా
అతడు::--ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ల ల్ల లల్ల లల్లాలాలల్లల్లలా
ఆమె::--ల ల ల ల ల ల లల్లల్లాలా లల్ల లల్లలా
ఆ..ఆ..ఆ.
అతడు::--తక్క ధీం తక్క ధీం
ఆమె::--ఆ...ఆ...
అతడు::--తక్క ధీం తక్క ధీం
ఆమె::--ట ట టా ట ట టా ట ట టా ట ట టా