Showing posts with label సొగసు చూడ తరమా--1995. Show all posts
Showing posts with label సొగసు చూడ తరమా--1995. Show all posts

Thursday, August 09, 2012

సొగసు చూడ తరమా--1995

సంగీతం::రమణి-ప్రసాద్
రచన::సిరివెన్నెల
గానం::అనురాధా శ్రీరాం

పల్లవి::

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
సీతకోక చిలకలమ్మా లేలేత చిగురాకులమ్మా
సీతకోక చిలకలమ్మా లేలేత చిగురాకులమ్మా
పారాడు పాపాయిలమ్మా పొంగి పారేటి సెలయేరులమ్మా
పొత్తిళ్ళలో చిట్టి పుత్తడి బొమ్మను పొదువుకున్న ముద్దుగుమ్మ అమ్మ
పొందేటి ఆనందం ఏదో తెలియాలంటే ఎత్తాలి తను ఆడజన్మా బ్రహ్మా

సీతకోక చిలకలమ్మా లేలేత చిగురాకులమ్మా
పారాడు పాపాయిలమ్మా పొంగి పారేటి సెలయేరులమ్మా

చరణం::1

కుహుకుహూ కూసే కోయిలా ఏదీ పలకవే ఈ చిన్నారిలా
మిలమిలా మెరిసే వెన్నెలా ఏదీ నవ్వవే ఈ బుజ్జాయిలా
అందాల పూదోట కన్నా చిందాడు పసివాడే మిన్నా
బుడత అడుగులే నడిచేటివేళలో పుడమితల్లికెన్ని పులకలో

సీతకోక చిలకలమ్మా లేలేత చిగురాకులమ్మా
పారాడు పాపాయిలమ్మా పొంగి పారేటి సెలయేరులమ్మా 
  
చరణం::2

గలగలా వీచే గాలిలా సాగే పసితనం తీయని ఒకవరం
ఎదిగిన ఎదలో ఎప్పుడూ నిధిలా దాచుకో ఈ చిరు జ్ఞాపకం
చిరునవ్వుతో చేయి నేస్తం చీమంత అయిపోదా కష్టం
పరుగు ఆపునా పడిపోయి లేచినా అలుపు సొలుపు లేని ఏ అలా

సీతకోక చిలకలమ్మా లేలేత చిగురాకులమ్మా
పారాడు పాపాయిలమ్మా పొంగి పారేటి సెలయేరులమ్మా

చరణం::3

పొత్తిళ్ళలో చిట్టి పుత్తడి బొమ్మను పొదువుకున్న ముద్దుగుమ్మ అమ్మ
పొందేటి ఆనందం ఏదో తెలియాలంటే ఎత్తాలి తను ఆడజన్మా బ్రహ్మా

సీతకోక చిలకలమ్మా లేలేత చిగురాకులమ్మా
పారాడు పాపాయిలమ్మా పొంగి పారేటి సెలయేరులమ్మా