సంగీతం::రమేశ్ నాయుడు
రచన::ఆరుద్ర
గానం::S.P.బాలు
Film Directed By::Vijayanirmala
తారాగణం::చంద్రమోహన్,గుమ్మడి,సూర్యకాంతం,అంజలీ దేవి,జయమాలిని, అల్లు రామలింగయ్య
పల్లవి::
పలికెను..ఏదో రాగం
పలికెను..ఏదో రాగం
అలివేణి...కళ్యాణి
అలివేణి..ఓ..కళ్యాణి
నా లలిత..శృంగార
మందారవనిలోనా
పలికెను..ఏదో రాగం
పలికెను..ఏదో రాగం
చరణం::1
నీ నయనాలే కాటుకకు
నీలిమ నేర్పెనని..ఈ..ఈ
నీ నయనాలే కాటుకకు నీలిమ నేర్పెనని
నీ నును పెదవి కెంపులకు
అరుణిమ..సమకూర్చెనని
మలయపవనం తెలుపగా విని
ప్రభవించే నాలో ప్రణయ భావ ధుని
పలికెను..ఏదో రాగం
పలికెను..ఏదో రాగం
చరణం::2
నీ నగుమోమే కుంకుమకు
నిగ్గులు తీర్చేనని..ఈ..ఈ
నీ నగుమోమే కుంకుమకు నిగ్గులు తీర్చేనని
నీ పాదాలే పారాణికి నవ రూపం దిద్దేనని
వలచే నా హృది..తెలుపగా విని
కల్యాణ భావన..కలిగెను విరిబోణి
పలికెను..ఏదో రాగం
పలికెను..ఏదో రాగం
అలివేణి...కళ్యాణి
అలివేణి..ఓ..కళ్యాణి
నా లలిత శృంగార..మందార వనిలోనా
పలికెను...ఏదో రాగం
పలికెను...ఏదో రాగం
Sangham Chekkina Silpalu--1979
Music::Ramesh Naiyudu
Lyrics::Arudra
Singer::S.P.Baalu
Film Directed By::Vijayanirmala
Cast::Chandramohan,Gummadi,Sooryakaantam,Anjalidevi,Jayamaalini,Alluraamalingayya.
::::::::::::
palikenu..EdO raagam
palikenu..EdO raagam
alivENi...kaLyaaNi
alivENi..O..kaLyaaNi
naa lalita..SRngaara
mandaaravanilOnaa
palikenu..EdO raagam
palikenu..EdO raagam
::::1
nee nayanaalE kaaTukaku
neelima nErpenani..ii..ii
nee nayanaalE kaaTukaku neelima nErpenani
nee nunu pedavi kempulaku
aruNima..samakoorchenani
malayapavanam telupagaa vini
prabhavinchE naalO praNaya bhaava dhuni
palikenu..EdO raagam
palikenu..EdO raagam
::::2
nee nagumOmE kunkumaku
niggulu teerchEnani..ii..ii
nee nagumOmE kunkumaku niggulu teerchEnani
nee paadaalE paaraaNiki nava roopam diddEnani
valachE naa hRdi..telupagaa vini
kalyaaNa bhaavana..kaligenu viribONi
palikenu..EdO raagam
palikenu..EdO raagam
alivENi...kaLyaaNi
alivENi..O..kaLyaaNi
naa lalita SRngaara..mandaara vanilOnaa
palikenu...EdO raagam
palikenu...EdO raagam
No comments:
Post a Comment