Tuesday, February 09, 2016

శ్రీవారి ముచ్చట్లు--1981



సంగీతం::చక్రవర్తి
రచన::దాసరినారాయణరావు
గానం::P.సుశీల 
Film DirecTed By::Dasari Narayana Rao
తారాగణం::అక్కినేనినాగేశ్వరరావు,జయప్రద,జయసుధ,గుమ్మడి,రాజబాబు,రమాప్రభప్రభకర్‌రెడ్డి,అల్లురామలింగయ్య,రాజసులోచన,నిర్మల. 

పల్లవి::

తూరుపు తెలతెల వారగనే
తలుపులు తెరిచి తెరవగనే
తూరుపు తెలతెల వారగనే
తలుపులు తెరిచి తెరవగనే

చెప్పాలమ్మ..ఆ..శ్రీవారి ముచ్చట్లు
తెలపాలమ్మ..ఆ..నువ్వు పడ్డా అగచాట్లు
శ్రీవారి ముచ్చట్లు..ఊ..శ్రీ శ్రీవారి ముచ్చట్లు
శ్రీవారి ముచ్చట్లు..ఊ..నీ శ్రీవారి ముచ్చట్లు

చరణం::1

కలగన్న..ఆ..మొదటి రాత్రికి
తలుపు తెరచే వేళ ఇది
వలదన్న..ఆ..ఒంటి నిండా
సిగ్గులొచ్చే వేళ ఇది

బెదురు చూపుల కనులతో
ఎదురు చూడని వణుకులతో
బెదురు చూపుల కనులతో..ఓఓ
ఎదురు చూడని వణుకులతో
రెప్పలార్పని ఈ క్షణం..సృష్టికే మూలధనం
తెప్పరిల్లిన మరుక్షణం..ఆడదానికి జన్మఫలం
ఆడదానికి జన్మఫలం 

తూరుపు తెలతెల వారగనే
తలుపులు తెరచి తెరవగనే
చెప్పాలమ్మ..ఆ..శ్రీవారి ముచ్చట్లు
తెలపాలమ్మ..ఆ..నువ్వు పడ్డా అగచాట్లు 

చరణం::2

ఇన్నాళ్ళ మూగనోముకు..మనసు విప్పే వేళ ఇది
ఇన్నేళ్ళ కన్నెపూజకు..హారతిచ్చే చోటు ఇది

మల్లెపందిరి నీడన..తెల్లపానుపు నడుమన
మల్లెపందిరి నీడన..తెల్లపానుపు నడుమన
ఎదురు చూసిన ఈ క్షణం..మరువలేని అనుభవం
మరచిపోనీ ఈ స్థలం..ఆడదానికి ఆలయం
ఆడదానికి ఆలయం 

తూరుపు తెలతెల వారగనే
తలుపులు తెరిచి తెరవగనే

చెప్పాలమ్మ..ఆ..శ్రీవారి ముచ్చట్లు
తెలపాలమ్మ..ఆ..నువ్వు పడ్డా అగచాట్లు
శ్రీవారి ముచ్చట్లు..ఊ..శ్రీ శ్రీవారి ముచ్చట్లు
శ్రీవారి ముచ్చట్లు..ఊ..నీ శ్రీవారి ముచ్చట్లు

Sreevari Muchchatlu--1981
Music::Chakravarti
Lyrics::Ddaasarinaaraayana Rao
Singer's::P.Suseela
Film Directed By::Dasari Narayana Rao
Cast::AkkinEniNaageswaraRao,Jayaprada,Jayasudha,Gummadi,Raajabaabu,Ramaaprabha,Prabhakar^Reddi,Alluraamalingayya,Raajasulochana,Nirmala.    

::::::::::

toorupu telatela vaaragane
talupulu terichi teravagane
toorupu telatela vaaragane
talupulu terichi teravagane

cheppaalamma..aa..Sreevaari muchchaTlu
telapaalamma..aa..nuvvu paDDaa agachaaTlu
Sreevaari muchchaTlu..uu..Sree Sreevaari muchchaTlu
Sreevaari muchchaTlu..uu..nee Sreevaari muchchaTlu

::::1

kalaganna..aa..modaTi raatriki
talupu terachE vELa idi
valadanna..aa..onTi ninDaa
siggulochchE vELa idi

beduru choopula kanulatO
eduru chooDani vaNukulatO
beduru choopula kanulatO..OO
eduru chooDani vaNukulatO
reppalaarpani ee kshaNam..sRshTikE mooladhanam
tepparillina marukshaNam..aaDadaaniki janmaphalam
aaDadaaniki janmaphalam 

toorupu telatela vaaragane
talupulu terachi teravagane
cheppaalamma..aa..Sreevaari muchchaTlu
telapaalamma..aa..nuvvu paDDaa agachaaTlu 

::::2

innaaLLa mooganOmuku..manasu vippE vELa idi
innELLa kannepoojaku..haaratichchE chOTu idi

mallepandiri neeDana..tellapaanupu naDumana
mallepandiri neeDana..tellapaanupu naDumana
eduru choosina ee kshaNam..maruvalEni anubhavam
marachipOnee ee sthalam..aaDadaaniki aalayam
aaDadaaniki aalayam 

toorupu telatela vaaragane
talupulu terichi teravagane

cheppaalamma..aa..Sreevaari muchchaTlu
telapaalamma..aa..nuvvu paDDaa agachaaTlu
Sreevaari muchchaTlu..uu..Sree Sreevaari muchchaTlu
Sreevaari muchchaTlu..uu..nee Sreevaari muchchaTlu

No comments: