సంగీతం::వింజమూరి సీత,గౌతం ఘోష్
రచన::సుద్దాల హనుమంతు
గానం::సంధ్య
Film Directed By::B.Narasingarao
రాతాగణం::సాయిచంద్,శకుంతల,హంస.
పల్లవి::
పల్లెటూరీ...పిల్లగాడా
పశులగాసే..మొనగాడ
పల్లెటూరీ...పిల్లగాడా
పశులగాసే..మొనగాడ
పాలు మరచీ..ఎన్నాల్లయ్యిందో
ఓ..పాలబుగ్గలా..జీతగాడా
కొలువు కుదిరీ..ఎన్నాల్లయ్యిందో
చాలి చాలని..చింపులంగీ
చల్లగాలికి..సగము ఖాళీ
చాలి చాలని..చింపులంగీ
చల్లగాలికి..సగము ఖాళీ
గోనె చింపూ..కొప్పెర పెట్టావా
ఓ..పాలబుగ్గలా జీతగాడా
దాని చిల్లులెన్నో..లెక్కాబెట్టేవా
తాటి గెగ్గలా..కాలి జోడూ
తప్పటడుగుల..నడక తీరు
తాటి గెగ్గలా..కాలి జోడూ
తప్పటడుగుల..నడక తీరు
బాటతో పని..లేకుంటయ్యిందా
ఓ..పాలబుగ్గలా జీతగాడా
చేతికర్రే తోడైపోయిందా
గుంపు తరలే..వంపులోకి
కూరుచున్నవు..గుండు మీద
గుంపు తరలే వంపులోకి
కూరుచున్నవు..గుండు మీద
దొడ్డికే నీవు..దొరవై పోయావా
ఓ..పాలబుగ్గలా జీతగాడా
దొంగ..గొడ్లనడ్డగించేవా
కాలువై..కన్నీరు గారా
కల్ల పై రెండు..చేతులాడ
కాలువై..కన్నీరు గారా
కల్ల పై రెండు..చేతులాడ
వెక్కి వెక్కి..ఏడ్చెదవదియేలా
ఓ..పాలబుగ్గలా జీతగాడా
ఎవ్వరేమన్నారో చెప్పేవా
మాయదారి..ఆవుదూడలు
మాటి మాటికి..ఎనుగుదుమికి
మాయదారి..ఆవుదూడలు
మాటి మాటికి..ఎనుగుదుమికి
పంట చేను పాడు..చేసాయా
ఓ..పాలబుగ్గలా జీతగాడా
పాలికాపూ..నిన్నే గొట్టాడా
నీకు జీతము..నెలకు కుంచము
తాలు వడిపిలి..కల్తి గాసము
నీకు జీతము..నెలకు కుంచము
తాలు వడిపిలి..కల్తి గాసము
కొలువగ శేరు..తక్కువ వచ్చాయా
ఓ..పాలబుగ్గలా జీతగాడా
తల్చుకుంటే..దుఖం వచ్చిందా
పల్లెటూరీ...పిల్లగాడా
పశులగాసే..మొనగాడ
పల్లెటూరీ...పిల్లగాడా
పశులగాసే..మొనగాడ
పాలు మరచీ..ఎన్నాల్లయ్యిందో
ఓ..పాలబుగ్గలా జీతగాడా
కొలువు కుదిరీ..ఎన్నాల్లయ్యిందో
కొలువు కుదిరీ..ఎన్నాల్లయ్యిందో
కొలువు కుదిరీ..ఎన్నాల్లయ్యిందో
Maabhuumi--1980
Music::Vinjamoori seeta goutam ghosh
Lyrics::Suddaal Hanumantu
Singer's::Sandhya
Film Directed By::B.Narasingarao
Cast::Saayichand,Sakuntala,Hamsa.
:::::::::
No comments:
Post a Comment