Monday, December 28, 2015

ముద్దుల ప్రియుడు--1994

సంగీతం::M.M.కీరవాణి 
రచన::వేటూరిసుందరరామ్మూర్తి 
గానం::S.P.బాలు,K.S.చిత్ర 
Film Directed By::K.Raghavendra Rao
  
పల్లవి::

చిటపట చిటపట కలబడి ముద్దు మీద ముద్దు పెట్టనా
తరిగిట తరిగిట తళకుల బుగ్గచూసి లగ్గమెట్టనా
చిలకల చిట్టెమ్మా చిదిమిన సిగ్గమ్మా
చినుకుల శ్రీరంగ వణుకుతూ వాటేస్తా
ఎగబడి దిగబడి మగసిరి కలబడి ఆలిగిన అందాలిక నీవే పదమంట
చిటపట చిటపట కలబడి ముద్దు మీద ముద్దు పెట్టనా
తరిగిట తరిగిట తళకుల బుగ్గచూసి లగ్గమెట్టనా

చరణం::1

నీ జంట జంపాలా తనువులు కలబడి తపనలు ముదరగనే
నీ చూపులియ్యాల పెదవుల ఎరుపుల తొలకరి చిలికెనులే
తెలిమబ్బో చెలి నవ్వో చలి గిలకలతో పలికెనులే గిలిగిలిగా
హరివిల్లో కనుచూపో తడి మెరుపులతో తడిమెనులే చలిచలిగా
మెచ్చి మెలిపెడతా గిచ్చి గిలిపెడతా
పచ్చి పడుచుల వలపుల చిలకలా పిలపిల పలుకుల
బుడిబుడి కులుకుల బుడిబుడి నడకలు వెంటాడు వేళల్లో

చిటపట చిటపట కలబడి ముద్దు మీద ముద్దు పెట్టనా
తరిగిట తరిగిట తళకుల బుగ్గచూసి లగ్గమెట్టనా

చరణం::2

నా మల్లె మరియాద మడిచిన సొగసుల విడిచిన ఘడియలలో
నీ కన్నె సిరి మీద చిలకల పలుకుల అలికిడి తళుకులలో
పసిమొగ్గ కసిబుగ్గ చలి చెడుగులలో చెరి సగమై అడిగెనులే
అది ప్రేమో మరి ఏమో యమ గిలగిలగా సలసలగా తొలిచెనులే
చేత చేపడతా చెంగు ముడిపెడతా
చెంప తళుకులు కలిసిన మెరుపులు దులిపిన ఒడుపున
తడిమిన సొగసుల తొడిమల తొణికిన అందాల వేటల్లో

చిటపట చిటపట కలబడి ముద్దు మీద ముద్దు పెట్టనా
తరిగిట తరిగిట తళకుల బుగ్గచూసి లగ్గమెట్టనా
చిలకల చిట్టెమ్మా చిదిమిన సిగ్గమ్మా
చినుకుల శ్రీరంగ వణుకుతూ వాటేస్తా
ఎగబడి దిగబడి మగసిరి కలబడి 
ఆలిగిన అందాలిక నీవే పదమంట
చిటపట చిటపట కలబడి ముద్దు మీద ముద్దు పెట్టనా
తరిగిట తరిగిట తళకుల బుగ్గచూసి లగ్గమెట్టనా

No comments: