Wednesday, November 25, 2015

సావాసగాళ్లు--1977



సంగీతం::J.V. రాఘవులు
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు, P.సుశీల
Film Directed By::Boyina Subba Rao
తారాగణం::కృష్ణ,జయచిత్ర,కైకాల సత్యనారాయణ,గిరిబాబు,గుమ్మడి,

పల్లవి::

కుచ్చిళ్లు జీరాడు కోక కట్టి
ఆ కొంగులోన దోరవయసు దాచిపెట్టి
నిలు నిలు నిలవమంటే నా తరమా  
నిన్ను నిలువెల్ల దోచకుంటే మగతనమా 
నిలు నిలు నిలవమంటే నా తరమా  
నిన్ను నిలువెల్ల దోచకుంటే మగతనమా 
కుచ్చిళ్లు జీరాడు కోక కట్టి  
ఆ కొంగులోన కోరికంతా మూటకట్టి 
నిలు నిలు నిలవమంటే నా తరమా  
నీకు నిలువు దోపిడివ్వకుంటే ఆడతనమా 
నిలు నిలు నిలవమంటే నా తరమా  
నీకు నిలువు దోపిడివ్వకుంటే ఆడతనమా 

చరణం::1

సిగలోన ముడిచావు మల్లెపూలు
అవి చెప్పినవి ఇన్నాళ్ళ నీ ఊసులు
సిగలోన ముడిచావు మల్లెపూలు
అవి చెప్పినవి ఇన్నాళ్ళ నీ ఊసులు
ఏడాది కిందటి జ్ఞాపకాలు

ఏడాది కిందటి జ్ఞాపకాలు..ఎగజిమ్ముతున్నాయి
ఘుమఘుమలు..ఘుమఘుమలు
నిలు నిలు నిలవమంటే నా తరమా
నీకు నిలువు దోపిడివ్వకుంటే ఆడతనమా 
నిలు నిలు నిలవమంటే నా తరమా 
నిన్ను నిలువెల్ల దోచకుంటే మగతనమా

చరణం::2

గున్నమావి చిగురు వేసెనూ
ఈ రేయి వెన్నెలకే వేడుకాయెను 
కుర్రతనం నిన్ను కోరెను
నాలోని కోరికలకు వాడి పుట్టెను 
పట్టెమంచం పడుచుదాయెను
దానిపై పరుపుకేదో మెరుపు వచ్చెను
పట్టెమంచం పడుచుదాయెను
దానిపై పరుపుకేదో మెరుపు వచ్చెను 
ఒట్టేసి పగలు వెళ్లెను  
నీ ముందు ఓడనని రాత్రి వచ్చెను 
కుచ్చిళ్లు జీరాడు కోక కట్టి...అహ 
ఆ కొంగులోన కోరికంతా మూటకట్టి
నిలు నిలు నిలవమంటే నా తరమా  
నిన్ను నిలువెల్ల దోచకుంటే మగతనమా 

చరణం::3

నెలవంక చూస్తుంది నీ వంక
ఈ నెల మొత్తం ఇలాగే ఉంటదంట 
నెలవంక చూస్తుంది నీ వంక
ఈ నెల మొత్తం ఇలాగే ఉంటదంట
చలి గాలి వీస్తుంది కిటికీ వెంటా..చ్..అహ
చలి గాలి వీస్తుంది కిటికీ వెంటా
తలుపేసుకుంటేనే మంచిదంటా 
మంచిదంటా..అహ..హ..అహ..హ
అహ..హ..అహ..హ
కుచ్చిళ్లు జీరాడు కోక కట్టి  
ఆ కొంగులోన కోరికంతా మూటకట్టి 
నిలు నిలు నిలవమంటే నా తరమా 
నిన్ను నిలువెల్ల దోచకుంటే మగతనమా 
నిలు నిలు నిలవమంటే నా తరమా
నీకు నిలువు దోపిడివ్వకుంటే ఆడతనమా

SaavaasagaaLlu--1977
Music::J.V.Raghavulu
Lyrics::Achaarya Atraeya
Singer's::S.P.Baalu, P.Suseela
Film Directed By::Boyina Subba Rao
Cast::Krishna,Jayachitra,Kaikaala Satyanaaraayana,Giribaabu,GummaDi,

::::

kuchchiLlu jeeraaDu kOka kaTTi
aa kongulOna dOravayasu daachipeTTi
nilu nilu nilavamanTE naa taramaa  
ninnu niluvella dOchakunTE magatanamaa 
nilu nilu nilavamaMTE naa taramaa  
ninnu niluvella dOchakunTE magatanamaa

kuchchiLlu jeeraaDu kOka kaTTi  
aa kongulOna kOrikantaa mooTakaTTi 
nilu nilu nilavamanTE naa taramaa  
neeku niluvu dOpiDivvakunTE aaDatanamaa 
nilu nilu nilavamanTE naa taramaa  
neeku niluvu dOpiDivvakunTE aaDatanamaa 

::::1

sigalOna muDichaavu mallepoolu
avi cheppinavi innaaLLa nee oosulu
sigalOna muDichaavu mallepoolu
avi cheppinavi innaaLLa nee oosulu
EDaadi kindaTi jnaapakaalu

EDaadi kindaTi jnaapakaalu
egajimmutunnaayi
ghumaghumalu..ghumaghumalu
nilu nilu nilavamanTE naa taramaa
neeku niluvu dOpiDivvakunTE aaDatanamaa 
nilu nilu nilavamanTE naa taramaa 
ninnu niluvella dOchakunTE magatanamaa

::::2

gunnamaavi chiguru vEsenoo
ee rEyi vennelakE vEDukaayenu 
kurratanam ninnu kOrenu
naalOni kOrikalaku vaaDi puTTenu 
paTTemancham paDuchudaayenu
daanipai parupukEdO merupu vachchenu
paTTemancham paDuchudaayenu
daanipai parupukEdO merupu vachchenu 
oTTEsi pagalu veLlenu  
nee mundu ODanani raatri vachchenu 

kuchchiLlu jeeraaDu kOka kaTTi...aha 
aa kongulOna kOrikantaa mooTakaTTi
nilu nilu nilavamanTE naa taramaa  
ninnu niluvella dOchakunTE magatanamaa 

::::3

nelavanka choostundi nee vanka
ee nela mottam ilaagE unTadanTa 
nelavanka choostundi nee vanka
ee nela mottam ilaagE unTadanTa
chali gaali veestundi kiTikee venTaa..ch..aha
chali gaali veestundi kiTikee venTaa
talupEsukunTEnE manchidanTaa 
manchidanTaa..aha..ha..aha..ha
aha..ha..aha..ha

kuchchiLlu jeeraaDu kOka kaTTi  
aa kongulOna kOrikantaa mooTakaTTi 
nilu nilu nilavamanTE naa taramaa 
ninnu niluvella dOchakunTE magatanamaa 
nilu nilu nilavamanTE naa taramaa
neeku niluvu dOpiDivvakunTE aaDatanamaa

No comments: