మ్రోగిందోయ్ భారతభేరీ మ్రోగిందోయ్
లేశమైన పరతంత్ర దేశమిక లేదీ ధరిత్రిమీదనుచు
రాజ్యములెల్ల ఒకే కుటుంబమని
రారాదికపై పోరాటములని..మ్రోగిందోయ్
ఆడుడు పాడుడు వేడుక మీరగ
అందరు జనులకు పండుగని
సదా ధ్యేయములు శాంత్యహింసలే
ప్రజా స్వామ్యమే ప్రపంచమున కని..మ్రోగిందోయ్
సర్వజనులకును, సర్వమతములకు
స్వాతంత్ర్యమ్మిట కలదనుచు
ప్రతి పౌరుండును రాష్ట్రపతేయన
ప్రాతినిథ్యమిటపాలన మందని..మ్రోగిందోయ్
నడువుడు నడువుడు మూడగు రంగుల
ముద్దుల పతాకనీడల్లో
సర్వసమమ్మిది శాంతి పథమ్మిది
ధర్మచక్ర కిరణమ్ములివేయని..మ్రోగిందోయ్
Desabhakti Geetaalu
Mrogindoi Bharata Bheri Mrogindoi
Lesamaina Paratantra Desamika Ledi Dharitri Midanuchu
Raajyamulella Oke Kutumbamani
Raaraadikapai Poraatamulani Mrogindoi
Aadudu Paadudu Veeduka Miraga
Andaru Janulaku Pandugani
Sadaa Dhyeeyamulu Saantyahimsale
Prajaa Swaamyame Prapanchamunakani Mrogindoi
Sarvajanulakunu, Sarvamatamulaku
Swaatantryammita Kaladanuchu
Prati Pourundunu Raashtrapateyana
Praatinidhyamita Paalanamandani Mrogindoi
Naduvudu Naduvudu Mudagu Rangula
Muddula Pataaka Nidallo
Sarva Sammamidi Saanti Padhammidi
Dharmachara Kiranammuliveyani Mrogindoi
No comments:
Post a Comment