Saturday, July 21, 2007

జమిందారు గారి అమ్మాయి--1975


సంగీతం::G.K.వేంకటేష్
రచన::ఆరుద్ర
గానం::నవకాంత్,గిరిజ
తారాగణం::శారద,రంగానాద్,రాజబాబు,గుమ్మడి,అల్లు రామలింగయ్య,మమత,గిరిబాబు 

పల్లవి::

ఇంటింట దీపాలు వెలగాలీ
మన ఊరంత చీకట్లు తొలగాలీ
ఇంటింట దీపాలు వెలగాలీ
మన ఊరంత చీకట్లు తొలగాలీ
కలవారి లోగిట్లో నిరుపేద ముంగిట్లో
కలవారి లోగిట్లో నిరుపేద ముంగిట్లో 
ఒకే లాగ కాంతులు నిండాలీ
ఒకే లాగ కాంతులు నిండాలీ

చరణం::1

ఓ యి౦ట చిరుదివ్వె నిలబెడితె
పదివేల దీపాలు వెలిగేనూ
పదివేల దీపాలు వెలిగేనూ
పోరుగింట పుణ్యాలూ ఇరుగింటి సౌఖ్యాలూ
పోరుగింట పుణ్యాలూ ఇరుగింటి సౌఖ్యాలూ
కలబోసి జనులంత బతకాలీ
కలబోసి జనులంత బతకాలీ        
ఇంటింట దీపాలు వెలగాలీ
మన ఊరంత చీకట్లు తొలగాలీ
కలవారి లోగిట్లో నిరుపేద ముంగిట్లో 
ఒకే లాగ కాంతులు నిండాలీ
ఒకే లాగ కాంతులు నిండాలీ

చరణం::2

దివినుండి వెలుతురు దినదినము వస్తుందీ
దివినుండి వెలుతురు దినదినము వస్తుందీ 
అది భువి నుండి ఈ రేయి పొంగిందీ
ఆ ఆ ఆ ఆ ఆ..ఆ ఆ ఆ ఆ ఆ
రంగు రంగుల కాంతి రమ్యమైన కాంతీ
రంగు రంగుల కాంతి రమ్యమైన కాంతీ
కలకాలం కన్నులో నిలపాలీ
కలకాలం కన్నులో నిలపాలీ    
ఇంటింట దీపాలు వెలగాలీ
మన ఊరంత చీకట్లు తొలగాలీ
కలవారి లోగిట్లో నిరుపేద ముంగిట్లో 
ఒకే లాగ కాంతులు నిండాలీ
ఒకే లాగ కాంతులు నిండాలీ a

No comments: