సంగీతం::సాలూరు హనుమంతరావు,T. V.రాజు
రచన::కొసరాజు రాఘవయ్య
గానం::ఘంటసాల
తారాగణం::N.T.రామారావు,వాణిశ్రీ,గుమ్మడి,B.సరోజాదేవి,కృష్ణంరాజు,విజయలలిత,అంజలిదేవి,
పల్లవి::
హల్లో మేడం..హల్లో మేడం
హల్లో మేడం మిష్టర్ రావ్ ఇప్పుడె వచ్చారూ
నీ పుట్టిన రోజు పండుగవేళకు ఇదిగో వచ్చారూ..హల్లో మేడం .
హల్లో మేడం మిష్టర్ రావ్ ఇప్పుడె వచ్చారూ
నీ పుట్టిన రోజు పండుగవేళకు ఇదిగో వచ్చారూ
హల్లో మేడం..హల్లో మేడం
చరణం::1
మదరాసు నుండి మాస్కోదాకా డెన్మార్క్ నుండి న్యుయార్కుదాకా
బెజవాడ నుండి బెర్లిందాకా పంజాబునుండి ప్యారిస్ దాకా
దేశాలన్నీ తిరిగాను మోసాలెన్నో చూశాను
దేశాలన్నీ తిరిగాను మోసాలెన్నో చూశాను
జనరల్ నాలెడ్జిలో నేను డాక్టరేటు కొట్టేశాను
హల్లో మేడం..హల్లో మేడం
చరణం::2
డబ్బులేకపోతే ఎవడు డుబ్బుకైన కొరగాడు
గడ్డి తినైన సంపాదిస్తే వాడే బహు మొనగాడు కాబట్టి
స్మగులింగుచేసి సాయంత్రానికి లక్షాధికారి కావచ్చు
దొంగనోట్లను అచ్చునగుద్ది కోటీశ్వరుడై కులుకొచ్చు
స్మగులింగుచేసి సాయంత్రానికి లక్షాధికారి కావచ్చు
దొంగనోట్లను అచ్చునగుద్ది కోటీశ్వరుడై కులుకొచ్చు
అసలు విషయం అది గుట్టుగ మేనేజ్ చెయ్యకపోతే
డేంజరులో పడిపోవచ్చు హల్లో మేడం హల్లో మేడం
చరణం::3
వేషాలు మార్చి మోసాలు చేయుట అలవాటైపోయిందీ
ఛెప్పేవన్నీ శ్రీరంగనీతులు ఛేసేవన్నీ తప్పుడు పనులు
ఎన్నాళ్ళో ఇవి సాగవూ బైట పడకుండా మానవూ
By the by here is your birth day gift
ఏమిటో తెలుసా
రవ్వల గాజులు తెచ్చాను నీ రెండు చేతులకు తగిలిస్తాను
రవ్వల గాజులు తెచ్చాను రెండు చేతులకు తగిలిస్తాను
ఏమిటలా చూస్తావు ఎందుకలా బిత్తరపోతావు హల్లో మేడం
No comments:
Post a Comment