Friday, July 12, 2013

మనుషుల్లో దేవుడు--1974


సంగీతం::సాలూరు హనుమంతరావు
రచన::కొసరాజు రాఘవయ్య
గానం::P.సుశీల
తారాగణం::N.T.రామారావు,వాణిశ్రీ,గుమ్మడి,B.సరోజాదేవి,కృష్ణంరాజు,విజయలలిత,అంజలిదేవి.

పల్లవి::

అమ్మమ్మమ్మోయ్...అమ్మమ్మమ్మో 
ఈ రొజుల్లో కుర్రవాళ్ళూ..భలే మోసగాళ్ళూ 
సందిస్తేచాలు పైన చెయ్యివేస్తారూ కొంపదీస్తారూ 

చరణం::1

అద్దంలో చుక్కబొట్టు..దిద్దుకుంటు నిలుచుంటే
చక్కని నైలాను చీరె..సర్దుకుంటు నేనుంటే
అద్దంలో చుక్కబొట్టు..దిద్దుకుంటు నిలుచుంటే
చక్కని నైలాను చీరె..సర్దుకుంటు నేనుంటే
చక్కలిగింతలు పెట్టాడే..ఉక్కిరిబిక్కిరి చేశాడే
చక్కలిగింతలు పెట్టాడే..ఉక్కిరిబిక్కిరి చేశాడే
నిలువున నే బిత్తరపోతే..నీ వాడనన్నాడే 
అమ్మమ్మమ్మొయ్..అమ్మమ్మమ్మో  
ఈ రొజుల్లో కుర్రవాళ్ళూ..భలే మోసగాళ్ళూ 
సందిస్తేచాలు పైన చెయ్యివేస్తారూ కొంపదీస్తారూ 

చరణం::2

ముసి ముసి నవ్వుల నీ మొగమ్ములో..ముద్దులుగారే నన్నాడే 
వయ్యారపు నీ నడకల్లోన..హొయలున్నవి పొమ్మన్నాడే 
మొగమాట పెట్టాడే..మొజురేగ గొట్టాడే  
మొగమాట పెట్టాడే..మొజురేగ గొట్టాడే 
దోచుకున్నాడే వలపు..తీర్చుకున్నాడే బలుపు 
అమ్మమ్మమ్మొయ్..అమ్మమ్మమ్మో  
ఈ రొజుల్లో కుర్రవాళ్ళూ..భలే మోసగాళ్ళూ 
సందిస్తేచాలు పైన చెయ్యివేస్తారూ కొంపదీస్తారూ 

చరణం::3

అమ్మ అయ్య చూస్తారంటే..ఫర్వాలేదని అన్నాడూ
పెళ్ళిగాని పిల్లనంటే..పెళ్ళాడతానన్నాడూ
అమ్మ అయ్య చూస్తారంటే..ఫర్వాలేదని అన్నాడూ
పెళ్ళిగాని పిల్లనంటే..పెళ్ళాడతానన్నాడూ
మాటలేన్నో చెప్పాడూ..మాయ చేసి పొయ్యాడూ  
మాటలేన్నో చెప్పాడూ..మాయ చేసి పొయ్యాడూ  
ఎక్కడైన చిక్కాడంటే..మక్కెలిరగ దంత చూడూ
అమ్మమ్మమ్మొయ్..అమ్మమ్మమ్మో  
ఈ రొజుల్లో కుర్రవాళ్ళూ..భలే మోసగాళ్ళూ 
సందిస్తేచాలు..పైన చెయ్యివేస్తారూ
కొంపదీస్తారూ..అమ్మమ్మమ్మొయ్ 

No comments: