Monday, June 08, 2015

విజేత--1985



సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరిసుందరరామమూర్తి 
గానం::S.P.బాలు 
తారాగణం::చిరంజీవి,భానుప్రియ,శారద, మహేష్‌బాబు


పల్లవి::

హే..హే..హే..హే..హే
ఓ..లలలలాల
జీవితమే ఒక పయణం..యవ్వనమే ఒక పవనం
వేగం వలపు రాగం ఎంత మధురం
పోద్దాం..చేరుకుంద్దాం ప్రేమ తీరం
హే..హే..హే..జీవితమే ఒక పయణం


చరణం::1

లయలో..నీ లయలో..నీ వయ్యారమే చూడనా
జతలో..నీ జతలో..నీ అందాలు వేటాడనా
వడిలో..నీ వడిలో..పూల ఉయ్యాలలే ఊగనా
వలపే..నా గెలుపై ప్రేమ జండాలు ఎగరేయనా
ఈ లోకమే మన ఇల్లుగా
పట్టాలే కలిపేసి..చెట్టపట్టాలు పట్టెయ్యనా
జీవితమే ఒక పయణం 

చరణం::2

ఎగిరి..పైకెగసి..నే తారల్ని తడిమెయ్యనా
తారా..దృవతారా..నీ తళుకుల్ని ముద్దాడనా
రాణి..మహరాణి..నా పారాణి దిద్దేయ్యనా
బోణీ..విరిబోణి..తొలిబోణీలు చేసేయ్యనా
మేఘాలలో ఊరేగుతూ
మెరుపుల్లో చినుకుల్లో..సిగ్గంత దోచేయనా
జీవితమే ఒక పయణం

చరణం::3

అలల..ఊయలలా నిను ఉర్రుతలూగించనా
తడిసే..నీ ఎదలో నే తాపాలు పుట్టించనా..ఆ..ఆ
మురిసే నవ్వులలో ఆణిముత్యాలు పండించనా
మెరిసే కన్నులలో నీలి స్వప్నాలు సృష్టించనా 
కెరటాలకే ఎదురీదుతూ
వెన్నెల్లా..నావల్లో..ఈ సంద్రాలు దాటెయ్యనా
జీవితమే ఒక పయణం..యవ్వనమే ఒక పవనం
వేగం వలపు రాగం ఎంత మధురం
పోద్దాం..చేరుకుంద్దాం ప్రేమ తీరం
హే..హేహే..హె..హేహేహే
ఓ..లలలలలాలా

No comments: