సంగీతం::J.V..రాఘవులు
రచన::అప్పలాచార్య
గానం::S.P.బాలు,B.వసంత
తారాగణం::కృష్ణ,జయప్రద,రోజారమణి,సత్యనారాయణ,అల్లు రామలింగయ్య,
ప్రభాకర రెడ్డి,రావు గోపాల రావు
పల్లవి::
ఆడించు ఆడించు జోరుగా
అందాలా పప్పునూనె గానుగా
ఆడించు ఆడించు జోరుగా
అందాలా పప్పునూనె గానుగా
నీ సోకంతా నేను చూస్తుంటా
పో పోమ్మాన్నా నేను పడివుంటా
నీ సోకంతా నేను చూస్తుంటా
పో పోమ్మాన్నా నేను పడివుంటా
ఆడిస్తా ఆడిస్తా జోరుగా
అందాలా పప్పునూనె గానుగా
ఆడిస్తా ఆడిస్తా జోరుగా
అందాలా పప్పునూనె గానుగా
చరణం::1
మట్టగోచి పెట్టుకోని దిమ్మమీద కూర్చోని
గిత్తమీద చెయ్యేసి తోడుతుంటే
మట్టగోచి పెట్టుకోని దిమ్మమీద కూర్చోని
గిత్తమీద చెయ్యేసి తోడుతుంటే
రంభలాగున్నావు జంబలకరె పంబలాగున్నాను
రంభలాగున్నావు జంబలకరె పంబలాగున్నాను
కానీ ఒకటి?
నిన్ను విడచి..బతకలేను
చూడకుండ..ఉండలేను
ఆడించు ఆడించు..జోరుగా
అందాలా..పప్పునూనె గానుగా
చరణం::2
తలకు రంగేసుకోని మొగిలిసెంటు పూసుకోని
మందుకొట్టి నువ్వొచ్చి ఊగుతుంటే
తలకు రంగేసుకోని మొగిలిసెంటు పూసుకోని
మందుకొట్టి నువ్వొచ్చి ఊగుతుంటే
ఎలా ఉన్నానంటావ్..కోతిలాగున్నావు
ముసలి తాత..లాగున్నావు
పోదు బడాయి..కోతిలాగున్నావు
ముసలి తాత..లాగున్నావు
ఆశ జాస్తి..అసలు నాస్తి
అరవకుండ..ఊరుకో
ఆడిస్తా ఆడిస్తా..జోరుగా
అందాలా..పప్పునూనె గానుగా
చరణం::3
ముత్యాల చమటబట్టి మురిపాల రైక తొడిగి
జారుతున్న కొప్పు నువ్వు సర్దుతుంటే
ముత్యాల చమటబట్టి మురిపాల రైక తొడిగి
జారుతున్న కొప్పు నువ్వు సర్దుతుంటే
బొమ్మలాగున్నావూ గుంతలకిడి గుమ్మలాగున్నావూ
బొమ్మలాగున్నావూ గుంతలకిడి గుమ్మలాగున్నావూ
కానీ ఒకటి?
కస్సుబుస్సులాడవద్దు..నవ్వితేనె నాకు ముద్దు
ఆడిస్తా ఆడిస్తా జోరుగా
అందాలా పప్పునూనె గానుగా
నీ సోకంతా నేను చూస్తుంటా
పో పోమ్మాన్నా నేను పడివుంటా
నీ సోకంతా నేను చూస్తుంటా
పో పోమ్మాన్నా నేను పడివుంటా
ఆడించు ఆడించు జోరుగా
అందాలా పప్పునూనె గానుగా
ఆడించు ఆడించు జోరుగా
అందాలా పప్పునూనె గానుగా
No comments:
Post a Comment