Wednesday, June 18, 2014

మహాకవి క్షేత్రయ్య--1976



సంగీతం::P.ఆదినారాయణరావు
రచన::ఆరుద్ర
గానం::V.రామకృష్ణ
తారాగణం::అక్కినేని,అంజలీదేవి,జయసుధ,కాంచన,మంజుల,ప్రభ

పల్లవి::

ఆ..రేపల్లె లోని గోపాలుడంట 
ఏ..పిల్లనైనా చూస్తే తంట
తలచుకుంటె ఆ జగడం కన్నుల పంట
ఓ..మజా మజా కన్నుల పంట       
ఆ..రేపల్లె లోని గోపాలుడంట 
ఏ..పిల్లనైనా చూస్తే తంట
తలచుకుంటె ఆ జగడం కన్నుల పంట
ఓ..మజా మజా కన్నుల పంట       

చరణం::1

సుందరి జాణ..బిందెలతోటి 
నీలాల రేవు..కొచ్చిందట    
సుందరి జాణ..బిందెలతోటి 
నీలాల రేవు..కొచ్చిందట
కళ్ళు కోలాటమాడ..మెచ్చిందంట
క్రిష్ణయ్య రాగా..అహ కేరింతలాడ
క్రిష్ణయ్య రాగా..కేరింతలాడ 
పైట జారె బిందె జారె..తెల్లబోయి పిల్లా జారె
పైట జారె బిందె జారె..తెల్లబోయి పిల్లా జారె         
తలచుకుంటె ఆ వైనం..నవ్వులపంట
ఆ..రేపల్లె లోని గోపాలుడంట 
ఏ..పిల్లనైనా చూస్తే తంట
తలచుకుంటె ఆ జగడం కన్నుల పంట 

చరణం::2

చక్కని చుక్క..సందేళ గుళ్ళో
మొక్కులు మొక్కంగ..వచ్చిందంట   
చక్కని చుక్క..సందేళ గుళ్ళో
మొక్కులు మొక్కంగ..వచ్చిందంట   
అహ..నిక్కుతు నీల్గుతు వచ్చిందంటా
నల్లనివాడు అల్లవరగా..నల్లనివాడు అల్లవరగా
కళ్ళు కలిపే..ఒళ్ళు మరిచే
దూరాన మొగుడు..కారాలు నూరె కళ్ళు
కళ్ళు కలిపే..ఒళ్ళు మరిచే
దూరాన మొగుడు..కారాలు నూరె కళ్ళు
తలచుకుంటె..ఆ రగడ రవ్వలమంట
ఆ..రేపల్లె లోని గోపాలుడంట 
ఏ..పిల్లనైనా చూస్తే తంట
తలచుకుంటె..ఆ జగడం కన్నుల పంట 

చరణం::3

అందాలభామ..చిందులు వేయ 
అందలమెక్కి..సాగిందంట 
అందాలభామ..చిందులు వేయ 
అందలమెక్కి..సాగిందంట
తన అందాలు..కాస్త దాచిందంట 
పిల్లనగ్రోవి..మొల్లనవింటే
హాయ్‌..పిల్లనగ్రోవి మొల్లనవింటే 
మేనుపొంగి..మేనా ఆపి 
తానేమొ క్రిష్ణయ్య..సన్నిధి చేరె
మేనుపొంగి..మేనా ఆపి
తానేమొ క్రిష్ణయ్య..సన్నిధి చేరె
తలచుకుంటె..ఆ జోడి గువ్వలజంట   
ఆ..రేపల్లె లోని గోపాలుడంట 
ఏ..పిల్లనైనా చూస్తే తంట
తలచుకుంటె ఆ జగడం కన్నుల పంట..ఓ కన్నుల పంట 

No comments: