సంగీతం::M.M.కీరవాణి
రచన::సిరివెన్నెల
గానం::K.S.చిత్ర
పల్లవి::
చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలి
మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండే దారికి
వెళ్ళనివ్వరా వెన్నెలింటికి
విన్నవించరా వెండిమింటికి
జోజో లాలి...జోజో లాలి
జోజో లాలి...జోజో లాలి
చరణం::1
మలిసంధ్య వేళాయే చలిగాలి వేణువాయే
నిదురమ్మా ఎటుబోతివే
మునిమాపు వేళాయే కనుపాప నిన్ను కోరే
కునుకమ్మా ఇటు చేరవే
నిదురమ్మా ఎటుబోతివే
కునుకమ్మా ఇటు చేరవే
గోధూళి వేళాయే గూళ్ళన్నీ కనులాయే
గువ్వల రెక్కలపైనా రివ్వూరివ్వున రావే
జోలపాడవా బేలకళ్ళకి
వెళ్ళనివ్వరా వెన్నెలింటికి
జోజో లాలి...జోజో లాలి
చరణం::2
పట్టుపరుపులేల పండువెన్నెలేల
అమ్మ ఒడి చాలదా బజ్జోవే తల్లి
పట్టుపరుపేలనే పండువెన్నెలేలనే
అమ్మ ఒడి చాలునే నిన్ను చల్లంగ జోకొట్టునే
నారదాదులేల నాదబ్రహ్మలేల
అమ్మ లాలి చాలదా బజ్జోవే తల్లి
నారదాదులేలనే నాదబ్రహ్మలేలనే
అమ్మ లాలి చాలునే నిన్ను కమ్మంగ లాలించునే
చిన్నిచిన్ని కన్నుల్లో ఎన్నివేల వెన్నెల్లో
తీయనైన కలలెన్నో ఊయలూగు వేళల్లో
అమ్మలాలపైడి కొమ్మలాల ఏడి ఏవయ్యాడు
అంతులేడియ్యాల కోటితందనాల ఆ నందలాల
గోవులాల పిల్లంగోవులాల గొల్లభామలాల
యాడనుంది ఆలనాటి నందనాల ఆనందలీల
జాడచెప్పరా చిట్టితల్లికి
వెళ్ళనివ్వరా వెన్నెలింటికి
జోజో లాలి...జోజో లాలి
చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలి
మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండే దారికి
No comments:
Post a Comment