సంగీతం::O.P.నయ్యర్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు
పల్లవి::
మనసొక మధుకలశం
పగిలే వరకే అది నిత్యసుందరం
మనసొక మధుకలశం
పగిలే వరకే అది నిత్యసుందరం
మనసొక మధుకలశం
చరణం::1
ఓహోహో ఆహాహా ఆహాహ ఓహోహో
మరిచిన మమతొకటీ
మరి మరి పిలిచినదీ
మరిచిన మమతొకటీ
మరి మరి పిలిచినదీ
ఒక తీయనీ పరితాపమై
ఒక తీయనీ పరితాపమై
మనసొక మధుకలశం
పగిలే వరకే అది నిత్యసుందరం
మనసొక మధుకలశం
చరణం::2
ఓహోహో ఆహాహా ఆహాహ ఓహోహో
తొలకరి వలపొకటీ
అలపుల తొలిచినదీ
తొలకరి వలపొకటీ
అలపుల తొలిచినదీ
గత జన్మలా అనుబంధమై
గత జన్మలా అనుబంధమై
మనసొక మధుకలశం
పగిలే వరకే అది నిత్యసుందరం
మనసొక మధుకలశం
పగిలే వరకే అది నిత్యసుందరం
మనసొక మధుకలశం
No comments:
Post a Comment