Thursday, May 20, 2010

అల్లుడొచ్చాడు--1976....

సంగీతం::T.చలపతిరావ్ 

రచన::ఆచార్య-ఆత్రేయ

గానం::S.P.బాలు

తారాగణం::రామకృష్ణ,రాజబాబు,జయసుధ,నాగభూషణం,ప్రభ,జయమాలిని,అల్లు రామలింగయ్య

పల్లవి::

వేళా పాళా ఉండాలమ్మా దేనికైనా

నువ్వు వేగిరపడితే రాదమ్మా తెరగ వచ్చేదైనా

వేళా పాళా ఉండాలమ్మా దేనికైనా

కోరిక నీలో ఎంతవున్నా..తీర్చే మొనగాడేదుట వున్నా

కోరిక నీలో ఎంతవున్నా..తీర్చే మొనగాడేదుట వున్నా

వేడి ఎక్కడో పుట్టాలి..నీ వేడుక అప్పుడు తీరాలి

వేళా పాళా ఉండాలమ్మా దేనికైనా

నువ్వు వేగిరపడితే రాదమ్మా తెరగ వచ్చేదైనా

వేళా పాళా ఉండాలమ్మా దేనికైనా

చరణం::1

పొదలో దుమ్మెద రొద పెడితే..మొగ్గకు తేనె వచ్చేనా

ఎదలో ఏదో సొద పెడితే..ఎంకి పాటగా పలికేనా

పొదలో దుమ్మెద రొద పెడితే..మొగ్గకు తేనె వచ్చేనా

ఎదలో ఏదో సొద పెడితే..ఎంకి పాటగా పలికేనా

పెదవులూ రెండూ కలవాలి..నీ ఎదలోని కుతి తీరాలి

వేళా పాళా ఉండాలమ్మా దేనికైనా

నువ్వు వేగిరపడితే రాదమ్మా తెరగ వచ్చేదైనా

చరణం::2

పదహారేళ్ళ ప్రాయంలోన ఫైటజారక నిలిచేనా

పదహారేళ్ళ ప్రాయంలోన ఫైటజారక నిలిచేనా 

ఎదిగే పొంగు ఏనాడైనా..ఎదిగే పొంగు ఏనాడైనా..అదిమిపట్టితే ఆగేనా

ఆగని వన్నీ రేగాలి..అప్పుడు మన కథ సాగాలి

వేళా పాళా ఉండాలమ్మా దేనికైనా

నువ్వు వేగిరపడితే రాదమ్మా తెరగ వచ్చేదైనా

వేళా పాళా ఉండాలమ్మా దేనికైనా

No comments: