సంగీతం::T.చలపతిరావు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
తారాగణం::అక్కినేని,శారద,ప్రభ,G.వరలక్ష్మి,జయమాలిని,సత్యనారాయణ,కాంతారావు,అల్లు రామలింగయ్య
పల్లవి::
పాడనా..ఆ..ఈ రేయి పాడనా..ఆఆఆ
నీ కోసమే..ఏఏఏ..పాడనా..ఆ
చందమామ వీణియపైన..తెలివెన్నెల తీగలపైన..ఆ
చందమామ వీణియపైన..తెలివెన్నెల తీగలపైన
కరిగే కలలే కరిగే కలలే..స్వరాలుగా..ఆఆఆ
పాడనా..ఆ..నే పాడనా..ఆ
చరణం::1
మనసులోన మెరిసే రూపం.. మౌనంలో కరిగింది
మనసులోన మెరిసే రూపం..మౌనంలో కరిగింది
పెదవిపైన విరిసే రాగం..హృదయంలో వెలిగింది..ఈ
హృదయంలో..ఓ..వెలిగింది
మౌనంలోన గానంలోన..మౌనంలోన గానంలోన
మౌనంలోన గానంలోన..మౌనంలోన గానంలోన
మధురిమ ఏదో వున్నదనీ..ఈ
పాడనా..ఆఆఆ..పాడనా..ఆ
చందమామ వీణియపైన తెలివెన్నెల తీగలపైన
చందమామ వీణియపైన తెలివెన్నెల తీగలపైన
కరిగే కలలే కరిగే కలలే స్వరాలుగా..ఆ
పాడనా..ఆఆఆ...నే..పాడనా
చరణం::2
ఏ రెమ్మకు..పూచిన సుమమో
నీ పూజకు..నిలిచింది..ఈ
ఏ జన్మల..నోముల ఫలమో..ఓ
ఇరువురినీ కలిపింది..ఇరువురినీ కలిపింది
ఆరాధనలో ఆవేదనలో..ఆరాధనలో ఆవేదనలో
ఆశల పున్నమి..వున్నదనీ
పాడనా..ఆఆఆ..పాడనా..ఆ
చందమామ వీణియపైన..తెలివెన్నెల తీగలపైన
చందమామ వీణియపైన..తెలివెన్నెల తీగలపైన
కరిగే కలలే..కరిగే కలలే స్వరాలుగా..ఆ
No comments:
Post a Comment