Thursday, June 05, 2014

మహాత్ముడు--1976



సంగీతం::T.చలపతిరావు
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::V.రామకృష్ణ 
తారాగణం::అక్కినేని,శారద,ప్రభ,జి.వరలక్ష్మి,జయమాలిని,సత్యనారాయణ,కాంతారావు,అల్లు రామలింగయ్య

పల్లవి::

మనిషి మనిషిగా..బ్రతకాలంటే 
మంచిని పెంచాలీ..మంచి యన్నది పెంచాలంటే 
మనసే పెరగాలి..ప్రతి మనిషీ ఎదగాలి
మనసే పెరగాలి..ప్రతి మనిషీ ఎదగాలి 

చరణం::1

ద్వేషం నిండిన..మోడు బ్రతుకులో 
స్నేహం పూవులు..పూయాలి
స్నేహం పూవులు..పూయాలి
చీకటి ముసిరిన..గుండెల్లో 
విజ్ణాన కాంతులే..విరియాలి
విజ్ణాన కాంతులే..విరియాలి
సమతా వేదం..చదువుకొనీ
మమతా గీతం..పాడుకొనీ
సమతా వేదం..చదువుకొనీ
మమతా గీతం..పాడుకొనీ
ప్రతి మానవుడు..ఒక మహాత్ముడై
ప్రతి మానవుడు..మహాత్ముడై 
జాతి గౌరవం..కాపాడాలి
జాతి గౌరవం..కాపాడాలి 
మనిషి మనిషిగా..బ్రతకాలంటే 
మంచిని..పెంచాలీ
మంచి యన్నది..పెంచాలంటే 
మనసే పెరగాలి ప్రతి మనిషీ ఎదగాలి
మనసే పెరగాలి ప్రతి మనిషీ ఎదగాలి 

చరణం::2

అందరూ జన్మించేది జనని కడుపులోనే 
అందరూ కనుమూసేది ధరణి పొరలలోనే
అందరూ జన్మించేది జనని కడుపులోనే 
అందరూ కనుమూసేది ధరణి పొరలలోనే
కొందరికే భోగాలెందుకు సంపదలో తేడాలెందుకు
కొందరికే భోగాలెందుకు సంపదలో తేడాలెందుకు 
శ్రమ విలువే గుర్తించనినాడు
శ్రమ విలువే గుర్తించనినాడు
జాతిపురోగతి లేనేలేదు..జాతిపురోగతి లేనేలేదు  
మనిషి మనిషిగా బ్రతకాలంటే మంచిని పెంచాలీ
మంచి యన్నది పెంచాలంటే 
మనసే పెరగాలి ప్రతి మనిషీ ఎదగాలి
మనసే పెరగాలి ప్రతి మనిషీ ఎదగాలి

No comments: