Sunday, May 11, 2008

ఇద్దరూ-ఇద్దరే--1976





సంగీతం::చక్రవర్తి
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల 
 తారాగణం::శోభన్‌బాబు,కృష్ణంరాజు,ప్రభాకరరెడ్డి,పద్మనాభం,మంజుల,చంద్రకళ,రాజబాబు
రావు గోపాలరావు

పల్లవి::
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ముళ్ళల్లో ఉన్నది ఈ పువ్వు
మోజుపడి వచ్చావు నువ్వూ
ముళ్ళల్లో ఉన్నది ఈ పువ్వు
మోజుపడి వచ్చావు నువ్వూ 
పంజరంలో పంచెవన్నెల చిలకా
పాడుతుందిలే నువ్వు వచ్చావు గనుక
వచ్చావు గనుక..వచ్చావు గనుక
ముళ్ళల్లో ముళ్ళల్లో ఉన్నది ఈ పువ్వు 

చరణం::1

అందం చందం ఆటాపాటల అంగడి అనుకున్నావు
ఆనందాల నవ్వుల పువ్వుల సందడి అనుకున్నావు
అందం చందం ఆటాపాటల అంగడి అనుకున్నావు
ఆనందాల నవ్వుల పువ్వుల సందడి అనుకున్నావు
చల్లని సమయాన స్వాగతమన్నాను
చల్లని సమయాన స్వాగతమన్నాను 
నీదొక భావము నాదొక భావము
ఆలపించెదను ఆలకించు మిక 
నా గానము....నా గానము   
ముళ్ళల్లో ఉన్నది..ఈ పువ్వు
మోజుపడి వచ్చావు..నువ్వూ
ముళ్ళల్లో ఉన్నది..ఈ పువ్వు 

చరణం::2

కన్నుల పండుగ చేసే నాట్యం కళగా భావించాలి
కమ్మని గానం విలువను ఎంచి రసికులు స్పందించాలి
కన్నుల పండుగ చేసే నాట్యం కళగా భావించాలి
కమ్మని గానం విలువను ఎంచి రసికులు స్పందించాలి
రసికుడు నీవైతే కోరకు సరసాలు
రసికుడు నీవైతే కోరకు సరసాలు
అందరి వంటిది కాదీ చిన్నది రాకు రాకు
ఇటు చేరరాకు నను మన్నించుమా   
ముళ్ళల్లో ఉన్నది...ఈ పువ్వు
మోజుపడి వచ్చావు...నువ్వూ 
పంజరంలో పంచెవన్నెల చిలకా
పాడుతుందిలే నువ్వు వచ్చావు గనుక
వచ్చావు గనుక..వచ్చావు గనుక
ముళ్ళల్లో ఉన్నది...ఈ పువ్వూ 

No comments: