సంగీతం::సత్యం
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు
తారాగణం::రామకృష్ణ,ప్రభ,శ్రీదేవి కపూర్,కంతారావు,ప్రభాకర్‌రెడ్డి,జ్యోతిలక్ష్మీ,జయమాలిని.
పాట పాడనా పాఠమే నేర్పనా
ఈ పాట ప్రతియేటా నీ యెదలో మ్రోగగా
చరణం::1
గలగలపారే సెలయేరులో పలికే రాగమే
జిలిబిలి నడకల చిరుగాలులలో చిలికే నాదమే
లలిత లలితముగ మధుర మధురముగ
గళములోన..సరిగమలై పలుకగ
పాట పాడినా పాఠమే నేర్పనా
ఈ పాట ప్రతియేటా నీ యెదలో మ్రోగగా
చరణం::2
రామసుధారస పానము చేసి రంజిల్లిన త్యాగయ్యా
గిరిధర వరగుణ గానము చేసి తరించిపోయిన మీరా
పలుకు పలుకులో పదము పదములో
పరవశించి...దీవన లందించగ
పాట పాడినా పాఠమే నేర్పనా
ఈ పాట ప్రతియేటా నీ యెదలో మ్రోగగా
No comments:
Post a Comment