సంగీతం::సూరవరాజు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,V.రామకృష్ణ
తారాగణం::N.T.రామారావు,ప్రభాకర రెడ్డి,త్యాగరాజు,అల్లు రామలింగయ్య,వాణిశ్రీ,శ్రీవిద్య,S.వరలక్ష్మి
పల్లవి :
ఎవ్వరిదీ యీ విజయం..ఎవ్వరిదీ యీ విజయం
నీది నాదీ అందరిదీ..యీ విజయం
అందరిదీ...యీ విజయం
మీ అందరిదీ...యీ విజయం
దేశరక్షణకు ప్రాణాలొడ్డిన ధీరులదే యీ విజయం
అందరిదీ యీ విజయం..మీ అందరిదీ యీ విజయం
చరణం::1
లార లార లార లార లా ల ల్ల ల్లా రా ల్లా రా
హిప్ హిప్ హూ రా..ఓహో హో హో హో హో
మంచు కొండలను నిలచీ మండు టెండలను సైచీ
మంచు కొండలను నిలచీ మండు టెండలను సైచీ
కంటికి కునుకే కరువై పోగా కన్నవారలే దూరంకాగా
రక్త తర్పణ౦ చేసిన సైనిక శక్తులదే యీ
విజయం...విజయం...విజయం
అందరిదీ యీ విజయం..మీ అందరిదీ యీ విజయం
దేశరక్షణకు ప్రాణాలొడ్డిన ధీరులదే యీ విజయం
అందరిదీ యీ విజయం..మన అందరిదీ యీ విజయం
చరణం::2
లార లార లార లార లా ల ల్ల ల్లా రా ల్లా రా
హిప్ హిప్ హూ రా..ఓహో హో హో హో హో
బాంబుల వర్షం కురిసినా ప్రళయ ఝ౦ఝలే వీచినా
బాంబుల వర్షం కురిసినా ప్రళయ ఝ౦ఝలే వీచినా
కుత్తుకలే తెగిపోతూ వున్నా గుండెలు రెండుగ చీలతువున్నా
ఎత్తిన జెండా దించని భారత పుత్రులదే యీ
విజయం...విజయం...విజయం
అందరిదీ యీ విజయం..మీ అందరిదీ యీ విజయం
దేశరక్షణకు ప్రాణాలొడ్డిన ధీరులదే యీ విజయం
అందరిదీ యీ విజయం..మన అందరిదీ యీ విజయం
చరణం::3
తుదిరక్తపు బిందువు చిందించిన మృతవీరులదే యీ విజయం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పెను మృత్యువునే ఎదిరించినట్టి క్షతగాత్రులదే యీ విజయం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
తుదిరక్తపు బిందువు చిందించిన మృతవీరులదే యీ విజయం
యీ విజయం
పెను మృత్యువునే ఎదిరించినట్టి క్షతగాత్రులదే యీ విజయం
యీ విజయం
ప్రాణ దాతలది..యీ విజయం..యీ విజయం
జాతి నేతలది యీ విజయం ఈ విజయం యీ విజయం
అందరిదీ యీ విజయం..మీ అందరిదీ యీ విజయం
దేశరక్షణకు ప్రాణాలొడ్డిన ధీరులదే యీ విజయం
అందరిదీ యీ విజయం..మన అందరిదీ యీ విజయం
లార లార లార లార లా ల ల్ల ల్లా రా ల్లా రా
లార లార లార లార లా ల ల్ల ల్లా రా ల్లా రా
No comments:
Post a Comment