Monday, May 26, 2014

పుట్టింటి గౌరవం--1975


సంగీతం::సత్యం
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల 
తారాగణం::కృష్ణంరాజు, భారతి,శుభ,ప్రభాకరరెడ్డి,సూర్యకాంతం,పద్మనాభం,అల్లు రామలింగయ్య

పల్లవి::

అన్నయ్యా నను కన్నయ్యా
నా కన్నుల వెలుగే నీవయ్యా
అన్నయ్యా నను కన్నయ్యా
నా కన్నుల వెలుగే నీవయ్యా
చెల్లెమ్మా నను కన్నమ్మా 
నీ చల్లని మనసే ఇల్లమ్మా 

చరణం::1

అమ్మా అని పిలిచినప్పుడు నువ్వే పలికావూ
అమ్మా అని పిలిచినప్పుడు నువ్వే పలికావూ
ఆకలినైన ఆశలనైనా నికే చెప్పానూ        
తల్లీ తండ్రీ నీవై నీ చెల్లి ని పెంచావూ
తల్లీ తండ్రీ నీవై నీ చెల్లి ని పెంచావూ
అన్నె౦ పున్నె౦ అన్నిటికీ నా అన్నే అనుకున్నాను    
చెల్లెమ్మా నను కన్నమ్మా నీ చల్లని మనసే ఇల్లమ్మా 
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ 

చరణం::2

ఎక్కడవున్నా ఏమైనా నీ మక్కువ మరువను 
ఎక్కడవున్నా ఏమైనా నీ మక్కువ మరువను
ఏ కష్టాలైనా నష్టాలైనా నీకు దాచను
పెళ్లి చేసి ఒక  అయ్య చేతిలో పెడతానమ్మా 
నిన్ను పుట్టింటి గౌరవం నిలబెట్టాలమ్మ నీవు      
అన్నయ్యా నను కన్నయ్యా
నా కన్నుల వెలుగే నీవయ్యా

No comments: