Saturday, May 09, 2009

రామయ్య తండ్రి--1975


సంగీతం::సత్యం
రచన::మల్లెమాల
గానం::S.P.బాలు 
తారాగణం::సత్యనారయణ,రంగనాద్,రాజబాబు,ముక్కామల,జయంతి,ప్రభ,
మీనాకుమారి,పండరీబాయి 

పల్లవి::

విధి నవ్విందీ..ఈ..పగ బూనిందీ..ఈ
విషపు గోళ్ళతో..మీటిందీ..ఈఈఈ
 విధి నవ్విందీ..ఈ..పగ బూనిందీ..ఈ
విషపు గోళ్ళతో..మీటిందీ..ఈఈఈ  
వీణ...మూగవోయిందీ
వీణ...మూగవోయిందీ 

చరణం::1
                   
ఎన్నో ఆశల..ప్రతిరూపం 
ఆ ఇంటికి ఒకడే..మణిదీపం
అయ్యో పాపం ఆ తలిదండ్రులు 
ఆనందంలో..వున్నారే
ఏడీ బాబని..తల్లి ఆడిగితే 
ఏమని బదులు..చెబుతావూ
ఎంత యేడ్చినా..లేని గొంతుతో 
ఎలా చెబుతావూ..ఎలా చెబుతావూ

విధి నవ్విందీ..ఈపగ బూనిందీ..ఈ
విషపు గోళ్ళతో...మీటిందీ..ఈఈఇ
వీణ...మూగవోయిందీ..ఈ
వీణ...మూగవోయిందీ..ఈ 

చరణం::2

ఏడాదైనా నిండని బిడ్డను యేటిపాలు చేశావే
చే జేతుల నువు చేసిన ఘోరం ఊరక పోయేనా
చే జేతుల నువు చేసిన ఘోరం ఊరక పోయేనా
ఆ తల్లి గుండెలో...రగిలే జ్వాలను
కన్నీళ్ళార్పేనా..ఆ..నీ కన్నీళ్ళార్పేనా..ఆ 

No comments: