సంగీతం::K.V.మహాదేవన్
రచన::వీటూరి సుందరరామమూర్తి
గానం::S.P.బాలు
తారాగణం::చలం,జయంతి,సత్యనారాయణ,భారతి,శుభ,K.విజయ,చలపతిరావు
పల్లవి::
పశువైనా పక్షైనా..మనిషైనా మాకైనా
అమ్మ మనసు ఒకటే..ఏఏఏ
అమ్మా దైవం ఒకటే..ఏఏఏ
తన తనువెల్లా కరిగించి..ఈఈఈ
తన బిడ్డలకా వెలుగులు పంచి..ఈఈ
చీకటిగా తన జీవితమంతా చివికి పోయినా..ఈ
చితికి పోయినా..ఈ..చితి మంటల చిటపటలో కూడా
చిరంజీవ..అని దీవించేది..అమ్మ మనసు..ఒకటే..ఏఏఏ
అందుకే దైవం అమ్మంటే..ఏఏఏఏ
పశువైనా పక్షైనా..మనిషైనా మాకయినా
అమ్మ మనసు..ఒకటే..ఏఏఏ
అమ్మా దైవం ఒకటే..ఏఏఏ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
No comments:
Post a Comment