సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల ,V.రామకృష్ణ
తారాగణం::శోభన్‌బాబు,లక్ష్మి,S.V.రంగారావు,నాగభూషణం,సత్యనారాయణ,జయకుమారి,రమణారెడ్డి
పల్లవి::
ఓర్నాయాల..చూశానురా..ఈ వేళా
ఓర్నాయాల..చూశానురా..ఈ వేళా
పిల్లంటె పిల్లకాదు..వర్ణించ వల్లకాదు
పిల్లంటె పిల్లకాదు..వర్ణించ వల్లకాదు
అడగొద్దురో..ఓ..దానందచందాలూ
ఓర్నాయాల..చూశావా..ఈ వేళా
ఓర్నాయాల..చూశావా..ఈ వేళా
ఏమేమిచూశావు..చూసి ఏమిచేశావు
ఏమేమిచూశావు..చూసి ఏమిచేశావు
చెప్పొద్దురో..ఓ..దానందచందాలు
ఓర్నాయాల..చూశానురా..ఈ వేళా
చరణం::1
చూశానొక పొగరబోతు..గొడ్డునూ
అది చూపులతో..కుమ్మిందీ కోడెనూ
చూశానొక పొగరబోతు..గొడ్డునూ
అది చూపులతో..కుమ్మిందీ కోడెనూ
అయ్యయ్యో..గుండెల్లో దూసుకొనిపోయిందా..ఆ
అది ఉండుండి మంటెడుతు వుందా..గోవిందా
గుండెల్లో..దూసుకొనిపోయిందా
అది ఉండుండి..మంటెడుతు వుందా
ఛ..ఛ..దూసుకొనీ పోనీక వాటేసుకున్నాను
దూసుకొనీ పోనీక వాటేసుకున్నాను
ముద్దొకటీ యిచ్చానూ..ముక్కు తాడు వేశానూ
ముద్దొకటీ యిచ్చానూ..ముక్కు తాడు వేశానూ
కొయ్..కొయ్..కోతలు కొయ్
ఓర్నాయాల..చూశానురా..ఈ వేళా
ఏమేమిచూశావు..చూసి ఏమిచేశావు
ఏమేమిచూశావు..చూసి ఏమిచేశావు
అడగొద్దురో..ఓ..దానందచందాలు
ఓర్నాయాల..చూశానురా..ఈ వేళా
చరణం::2
నడిరేయిలోన..నడిరేయిలోన
సుడిగాలిలా గదిలోకి..గబగబ వచ్చింది
నన్ను సుట్టేసి..సుడి తిరిగిపోయింది
నడిరేయిలోన..సుడిగాలిలా
గదిలోకి..గబగబ వచ్చింది
నన్ను సుట్టేసి..సుడి తిరిగిపోయింది
ఆయ్యయ్యో ఓపలేని..ఆ తాపం ఒళ్ళంతా రగిలిందా
దాని కోపంతో..నీ గూబ పగిలిందా
ఓపలేని..ఆ తాపం ఒళ్ళంతా రగిలిందా
దాని కోపంతో..నీ గూబ పగిలిందా
ఛ..ఛ..తెల్లార్లు నాతోటె గడిపిందీ
తెల్లవార్లు..నాతోటె గడిపిందీ
ఇక వెళ్ళలేనంటూ..ఊ..నా వెంటపడిందీ
పడుతుంది..పడుతుంది
ఓర్నాయాల..చూశానురా ఈ వేళా
ఏమేమిచూశావు..చూసి ఏమిచేశావు
ఏమేమిచూశావు..చూసి ఏమిచేశావు
అడగొద్దురో..ఓ..దానందచందాలు
ఓర్నాయాల..చూశానురా ఈ వేళా
ఓర్నాయాల..చూశావా ఈ వేళా
ఓర్నాయాల..చూశానురా ఈ వేళా
No comments:
Post a Comment