Friday, May 17, 2013

అమ్మ మనసు--1974



సంగీతం::K.V.మహాదేవన్
రచన::దేవులపల్లికృష్ణశాస్త్రి  
గానం::S.P.బాలు,P.సుశీల  
తారాగణం::చలం,జయంతి,సత్యనారాయణ,భారతి,శుభ,K.విజయ,చలపతిరావు 

పల్లవి::

శ్రీశైల భవనా మేలుకో..శ్రితచిత్త సదనా మేలుకో 
తూరుపున..బంగారు రేకలు దోచే 
చేరువున..పొందామరలు విరబూచే 
సుప్రభాతము..శుభకరమూ సుప్రభాతము
శుభకరమూ..సుప్రభాతము శుభకరమూ

చరణం::1

చిట్టిపొట్టి పిచికలు..లేచారా 
చిన్ని పూలమొలకలు..చూచారా 
చిట్టిపొట్టి పిచికలు..లేచారా 
చిన్ని పూలమొలకలు..చూచారా 
గోడపై కోడిపుంజు..కొక్కొరొకో అంది 
గూటిలో కాకిపిల్ల..కాకా అంది  
సుప్రభాతము..శుభకరమూ..మ్మ్ మ్మ్ మ్మ్  
సుప్రభాతము..శుభకరమూ

చరణం::2

మడుగులో..కప్ప లెవరు
బెక..బెక..బెక..బెక
చెరువులో..చేప లెవరు
టోయ్..టోయ్..టోయ్..టోయ్
మడుగులో..కప్పలైతే 
చెరువులో..చేపలైతే 
విప్పకాయ..పిల్లలకు 
ఉడుకుడుకు..నీళ్ళు
చెప్పినట్టు వింటే..చిట్డుకు నీళ్ళు 
సుప్రభాతము..శుభకరమూ 
సుప్రభాతము..శుభకరమూ

చరణం::3

పాహిమాం..పాహిమాం
జగదేక బంధూ..పాహిమాం
పాహిమాం..కారున్య సింధూ 
పతిత పావనా..దీనజనావన 
ప్రేమనిధాన..పాహిమాం
పతిత పావనా..దీనజనావన 
ప్రేమనిధాన..పాహిమాం

చరణం::4

నీ ఒడిలో..ఒదిగే పాపలం 
పాహిమాం..పాహిమాం 
నీ అడుగుల..వాలే పూవులం
పాహిమాం..పాహిమాం
నీ దయవుంటే..నీశెలవైతే
నీ గుడిలో..వెలిగే దివ్వెలం
నీ దయవుంటే..నీశెలవైతే
నీ గుడిలో..వెలిగే దివ్వెలం
పతితపావనా..దీనజనావన 
ప్రేమనిధాన..పాహిమాం
పాహిమాం..పాహిమాం
పాహిమాం..పాహిమాం
పాహిమాం..పాహిమాం
జగదేక బంధూ..పాహిమాం
పాహిమాం..కారున్య సింధూ 

No comments: