Wednesday, February 06, 2013

అమ్మ మనసు--1974



సంగీతం::K.V.మహాదేవన్
రచన::దేవులపల్లి కృష్ణశాస్త్రీ 
గానం::S.P.బాలు,P.సుశీల 
తారాగణం:: చలం,జయంతి,సత్యనారాయణ,భారతి,శుభ,K.విజయ,చలపతిరావు 

పల్లవి::

అరె చిక్ చిక్ చిక్ చిక్ రైలుబండీ
అది చక చక చక చక వెళ్తుందండి మేలు బండి
అరె చిక్ చిక్ చిక్ చిక్ రైలుబండీ
అది చక చక చక చక వెళ్తుందండి మేలు బండి
కుకూ..రూ..రురూ..రురూ..రురూ..రురూ

చరణం::1

పప్పూ బువ్వా తిన్నావంటే తిన్నావంటే 
పండరిపురమే వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు 
పప్పూ బువ్వా తిన్నావంటే తిన్నావంటే 
పండరిపురమే వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు 
పాండురంగని చూడొచ్చు..పాలూ మీగడ పెట్టచ్చు 
జై జై విఠలా..పండరినాధా..జై జై విఠలా..పాండురంగా 
జై జై విఠలా..పండరినాధా..జై జై విఠలా..పాండురంగా  
కుకూ..రురూ..రురూ
అరె చిక్ చిక్ చిక్ చిక్ రైలుబండీ
అది చక చక చక చక వెళ్తుందండి మేలు బండి

చరణం::2

బుద్ధిగ నువ్వు బజ్జున్నావా బృందావనమే వెళ్ళొచ్చు 
బుద్ధిగ నువ్వు బజ్జున్నావా బృందావనమే వెళ్ళొచ్చు 
బుజ్జి కృష్ణునీ చూడొచ్చు _బోలెడు వెన్న అడగొచ్చు 
తారంగం..తారంగం తాండవకృష్ణా తారంగం ఆహా..తారంగం..
తారంగం ఆహా..తాండవకృష్ణా తారంగం..ఊహు.హు..ఊహు.హు
అరె చిక్ చిక్ చిక్ చిక్ రైలుబండీ
అది చక చక చక చక వెళ్తుందండి మేలు బండి

చరణం::3

చప్పుడు చేయక రావాలీ చెప్పినట్టుగా చేయాలి..ఏమిటి ? 
దానిససస సరిస దసనీసస  బాధనినిని దనిని దనీ సదనిస 
వేళా పాళా వుండాలి వెర్రికి హద్దు వుండాలి 
వేళా పాళా వుండాలి వెర్రికి హద్దు వుండాలి
ఊహు.హు..ఊహు.హు..ఊహు.హు

No comments: