సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::బాలకృష్ణ,హరికృష్ణ,జానకి, సత్యనారాయణ,రోజారమణి, చంద్రమోహన్,రేలంగి,ధూళిపాళ
పల్లవి::
ఎగిరే గాలిపటానికి..దారం ఆధారం
ఎగిరే గాలిపటానికి..దారం ఆధారం
నా నిరుపేద జీవితానికి..నీ ప్రేమే ఆధారం
నా నిరుపేద జీవితానికి..నీ ప్రేమే ఆధారం
చరణం::1
ప్రేమే ఒక కలిమి..దానికి లేనే లేదు లేమి
నా మనసే నిను వలచింది..ఆ వలపే జత కలిపిందీ
నా మనసే నిను వలచింది..ఆ వలపే జత కలిపిందీ
కలిసిన జంటల విడదీస్తుంది కాలం కాలం
ఆ కాలానికి ఎదురీదీ..చేరుకుందాము ఆవలి తీరం
ఎగిరే గాలిపటానికి దారం ఆధారం
నా నిరుపేద జీవితానికి నీ ప్రేమే ఆధారం
చరణం::2
ఏ సుడిగాలి వీస్తుందో..ఏ జడివాన వస్తుందో
ఏ సుడిగాలి వీస్తుందో..ఏ జడివాన వస్తుందో
ఈ బంధం గాలిపటంలా..ఏ నిమిషం ఏమవుతుందో
గాలికి చెదరదు..వానకు తడవదు బంధం మన బంధం
అది ఎగరేసే ఒడుపుంటే..నిలిచిపోతుంది కలకాలం
ఎగిరే గాలిపటానికి దారం ఆధారం
నా నిరుపేద జీవితానికి నీ ప్రేమే ఆధారం
అహహా అహహా అహాహా హ్హా..అహహా అహహా అహాహా హ్హా
No comments:
Post a Comment