సంగీతం::సాలూరి రాజేశ్వరరావు
రచన::కోసరాజు రాఘవయ్య
గానం::S.P.బాలు
తారాగణం::అక్కినేని,శారద,కాంచన,నాగభూషణం,గుమ్మడి,చంద్రమోహన్,సూర్యకాంతం,రమాప్రభ,రాజబాబు,చలం,అల్లురామలింగయ్య.
పల్లవి::
ఓ దేవా ! ఆనందరావా!
వందిమాగధుల బోధలనుండి బైటపడి
ఈ కష్టజీవుల గోడు వినిపించుకోవయ్య..ఆఆఆఆఆఆ
గుళ్లో దేవుడు కళ్ళుమూసుకొని కూర్చుని వుంటే ఏముంది
భక్తులు చేసే పాపాలకు యిక హద్దూ పద్దూలేకుంది
గుళ్లో దేవుడు కళ్ళుమూసుకొని కూర్చుని వుంటే ఏముంది
చరణం::1
కష్టపడి రోజంతా పనిచేయడం మావంతు
క్లబ్బుల్లో తాగి తందనాలాడడం మీవంతు
ఇదేనాన్యాయం..ఊఊఊఊఊఉ
రాబందుల్లా మీదళారులు రక్తంపీలుస్తున్నారు
రక్తంపీలుస్తున్నారు
కడుపులుగొట్టి గుంటనక్కలై కమీషన్లుతీస్తున్నారు
ఆహా..కమీషన్లుతీస్తున్నారు
భక్తులు చేసే పాపాలకు యిక హద్దూ పద్దూలేకుంది
గుళ్లో దేవుడు కళ్ళుమూసుకొని కూర్చుని వుంటే ఏముంది
చరణం::2
ఆఆఆఆఆఆఆఆఆఆ
నోరూ వాయీలేని..పశువులము కాము
ఉడుకు నెత్తురువున్న..మనుషులం మేము
ఇన్నాళ్ళు ఏలాగో..ఓర్సుకున్నాము
ఇక మీపప్పులుడకవని..చెపుతున్నాము
లేనివాళ్ళ...యీ ఆకలి చిచ్చు
రేగిందంటే...తిప్పలు తెచ్చు
కపట భక్తులా..గెంటకపోతే
మూలవిరాట్టుకే..మోసం వచ్చు
భక్తులు చేసే పాపాలకు యిక హద్దూ పద్దూలేకుంది
గుళ్లో దేవుడు కళ్ళుమూసుకొని కూర్చుని వుంటే ఏముంది
గుళ్లో దేవుడు కళ్ళుమూసుకొని కూర్చుని వుంటే ఏముంది
No comments:
Post a Comment