Wednesday, May 16, 2007

భలే పాప--1971


సంగీతం::R.సుదర్శనం
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల 
తారాగణం::S.V.రంగారావు,K.R.విజయ,బేబి రాణి,జ్యోతిలక్ష్మి,పద్మనాభం,రేలంగి. 

పల్లవి::

అమ్మల్లారా ఓ అయ్యల్లారా మా 
అమ్మ నెవరైనా చూశారా చూశారా 
అమ్మల్లారా ఓ అయ్యల్లారా మా 
అమ్మనెవరైనా చూశారా చూశారా 

చరణం::1

ముద్దు ముద్దు మాటల ముగ్గులే వేసిందీ
చితికిన బ్రతుకును చివురింప జేసిందీ
ముద్దు ముద్దు మాటల ముగ్గులే వేసిందీ
చితికిన బ్రతుకును చివురింప జేసిందీ
బొమ్మలా వచ్చిందీ అమ్మలా నిలచిందీ
బొమ్మలా వచ్చిందీ అమ్మలా నిలచిందీ
ఒక మాటైనా చెప్పకా మాయమైపోయిందీ
అమ్మల్లారా ఓ అయ్యల్లారా మా 
అమ్మ నెవరైనా చూశారా చూశారా 

No comments: