Tuesday, May 10, 2011

సతీ అనసూయ--1971::మార్వ::రాగం



సంగీతం::P.ఆదినారాయణ
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
తారాగణం::N.T.రామారావ్,కాంతారావు,జమున,శోభన్ బాబు,శారద,రాజనాల,రాజబాబు,మీనాకుమారి,హలం.

మార్వ::రాగం 

పల్లవి::

హే ప్రభో..ఓ..ఓఓఓఓఓఓఓఓ   
గరళమ్ము మ్రింగి లోకములనే కాపాడి
ధరణిపై దయబూని సురగంగ విడనాడి
ప్రమధుల కొలువులో పరవశించేవా..ఆ
తండవార్భటిలోన తనువు మరచేవా..ఆ 

హిమగిరి మందిరా గిరిజా సుందరా
హిమగిరి మందిరా గిరిజా సుందరా
కరుణా సాగరా మొరవినరారా
హిమగిరి..మందిరా..ఆఆఆ   

చరణం::1

భుజంగ భూషణా అనంగభీషణా 
భుజంగ భూషణా అనంగభీషణా 
కరాళ జ్వాల లెగిసెరా కావగరాదా
ప్రభో..శంకరా..ఆ         
హిమగిరి మందిరా గిరిజా సుందరా
కరుణా సాగరా మొరవినరారా
హిమగిరి...మందిరా..ఆఆఆ 

చరణం::2
  
పతి సేవనమే జీవనమై నిలిచిన నేను
పలు నిందలతో గుండెపగిలి కుందితినేడు
పతి సేవనమే జీవనమై నిలిచిన నేను
పలు నిందలతో గుండెపగిలి కుందితినేడు
జటాచ్చటాధ..ఆ..జగద్భయంకరా..ఆ
జటాచ్చటాధ..ఆ..జగద్భయంకరా..ఆ
దురంత మాపివేయరా పరుగునరారా
ప్రభో...ఈశ్వరా..ఆఆ 

No comments: