Friday, May 21, 2010

మహామంత్రి తిమ్మరుసు--1962::మోహన::రాగం



సంగీతం::పెండ్యాలనాగేశ్వర రావు
రచన::పింగళి నాగేద్ర రావు 
గానం::P.సుశీల,ఘంటసాల
తారాగణం::N.T. రామారావు,దేవిక,గుమ్మడి,రేలంగి, S. వరలక్ష్మి
మోహన::రాగం  పల్లవి::

మోహన రాగమహా మూర్తిమంతమాయె
మోహన రాగమహా మూర్తిమంతమాయె
నీ ప్రియ రూపము కన్నుల ముందర నిలచిన చాలునులే
మోహన రాగమహా..మూర్తిమంతమాయె..

చరణం::1

చిత్రసీమలో వెలయగ జేసి దివ్యగానమున జీవము పోసి
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
చిత్రసీమలో వెలయగ జేసి దివ్యగానమున జీవము పోసి
సరసముగా నను చేరగ పిలిచే ప్రేయసియేయనగా
మోహన రాగమహా..మూర్తిమంతమాయె

చరణం::2

నాకే తెలియక నాలో సాగే ఆలాపనలకె రూపము రాగా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ 
నాకే తెలియక నాలో సాగే ఆలాపనలకె రూపము రాగా
ఆరాధించిన ప్రియభావమిలా పరవశించెననగా 
మోహన రాగమహా..మూర్తిమంతమాయె 

No comments: