సంగీతం::K.V.మహదేవాన్
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::P.సుశీల,S.P.బాలు
Director::Adurthi Subba Rao
తారాగణం::కృష్ణ,కాంతారావు,చంద్రమోహన్,గిరిబాబు,జరీనా,అంజలీదేవి,శుభ,సూర్యకాంతం
పల్లవి::
రేపు వస్తానన్నావు ఈ మాపు ఎక్కడ వుంటావు
నీ కళ్ళలోనే తెల్లవార్లు కాపురముంటాను రేపటికొస్తాను
చరణం::1
రేపు ఎంతో తియ్యనిదీ నేటికన్నా కమ్మనిదీ
మాపు వచ్చే కలలకు రూపు రేపులోనే ఉన్నది
రేపు ఎంతో తియ్యనిదీ నేటికన్నా కమ్మనిదీ
మాపు వచ్చే కలలకు రూపు రేపులోనే ఉన్నది
రేపు ఎంతో తియ్యనిదీ నేటికన్నా కమ్మనిదీ
చరణం::2
నిన్న ఆశలు నేడు తొడిగిన మొగ్గలౌతాయి
నేటి మొగ్గలు రేపు విరిసిన పువ్వులౌతాయి
కొత్త కొత్త సోయగాలు కునుకు తీస్తూ ఉంటాయి
మెత్త మెత్తగ కౌగిలిస్తే మేలుకొఒ౦టాయి మిడిసిపడతాయి
రేపు ఎంతో తియ్యనిదీ నేటికన్నా కమ్మనిదీ
మాపు వచ్చే కలలకు రూపు రేపులోనే ఉన్నది
రేపు ఎంతో తియ్యనిదీ నేటికన్నా కమ్మనిదీ
చరణం::3
ముసుగు తీయని తామరల్లె నీవు ఉంటావు
ముసురు వీడిన సూర్యుడల్లె నీవు వస్తావు
రేకు రేకు గడియ తీసి లేత వయసు తలపు తెరచి
రేపు ఒడిలో రకరకాల రుచులు చూస్తాము గెలుచుకుందాము
రేపు ఎంతో తియ్యనిదీ నేటికన్నా కమ్మనిదీ
మాపు వచ్చే కలలకు రూపు రేపులోనే ఉన్నది
రేపు ఎంతో తియ్యనిదీ నేటికన్నా కమ్మనిదీ
No comments:
Post a Comment