Thursday, July 03, 2014

గాజుల కిష్టయ్య--1975

సంగీతం::K.V.మహదేవాన్
రచన::ఆచార్య-ఆత్రేయ 
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::కృష్ణ,కాంతారావు,చంద్రమోహన్,గిరిబాబు,జరీనా,అంజలీదేవి,శుభ,సూర్యకాంతం   

పల్లవి::

ఇన్ని రోజులింత సొగసు ఏడ దాచుకున్నావు
ఇంత కాలమింత మనసు ఏమి చేసుకున్నావు

చరణం::1

మనసు నాకు ఉన్నదని నీ మనసే వచ్చి తెలిపినది
మూసివున్న ఆ తలుపులు నువ్వే మొదటిసారిగ తెరిచినది
మనసు నాకు ఉన్నదని నీ మనసే వచ్చి తెలిపినది
మూసివున్న ఆ తలుపులు నువ్వే మొదటిసారిగ తెరిచినది
సూర్యుని వెలుగు సోకినప్పుడే తామర అందం తెలిసేది
సూర్యుని వెలుగు సోకినప్పుడే తామర అందం తెలిసేది
నీ చూపులు నాఫై పడినప్పుడే సొగసులు నాలో విరిసేది
ఇన్ని రోజులింత సొగసు ఏడ దాచుకున్నావు

చరణం::2

అందలాన అందీ అందని అందమల్లే నువ్వున్నావు
అందుకోను చేయి జాపే ఆశల్లే నేనున్నాను
ఇన్ని రోజులింత సొగసు ఏడ దాచుకున్నావు
ఇంత కాలమింత మనసు ఏమి చేసుకున్నావు

చరణం::3

కాటు వేసే కరినాగే నీ కౌగిలిలో నను చేర్చినది
కాటు వేసే కరినాగే నీ కౌగిలిలో నను చేర్చినది
ఓర్వలేని ఈ విషలోకం విడదీస్తే ఏం చేసేది
మనసిస్తే చాలును నాకు.. నువు మాటిస్తే చాలును నాకు 
మనసులేని మనుషుల మాటే వద్దు ఇంక నీకు నాకూ
ఇన్ని రోజులింత సొగసు ఏడ దాచుకున్నావు
ఇంత కాలమింత మనసు ఏమి చేసుకున్నావు

No comments: