సంగీతం::K.V.మహాదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు
పల్లవి::
పిల్లగాలి ఊదిందీ పిల్లనగ్రోవీ
పల్లవించి ఊగిందీ గున్నమావీ
ఈఈఈఈఈఈ
మా పల్లె మారింది వ్రేపల్లెగా
మనసేమొ పొంగింది పాలవెల్లిగా
ఆఆఆఆఆఆ
చెలువ పంపిన పూలరేకులు
చిలిపి బాసల మూగలేఖలు
మరల మరలా చదువుకొందును
మనసునిండా పొదుగు కొందును
చిలిపి బాసల మూగలేఖలు
చెలువ పంపిన పూలరేకులు
పరిమళాలే పల్లవులుగా
ప్రణయ గీతము లల్లుకొందునూ
ప్రణయ గీతము లల్లుకొందునూ
బ్రతుకు పాటగా పాడుకొందునూ
చిలిపి బాసల మూగ లేఖలు
చెలువ పంపిన పూల రేకులు
ఎవరికోసము రాధ ఏతెంచెనో
ఎదురు పడగ లేక ఎటు పొంచె
తిలకించి లోలోన పులకించెనో
చిలిపి కృష్ణుడు అంత చెంగు చేపట్టగా
నిలువెల్ల ఉలికిపడి తలవాల్చెనో
No comments:
Post a Comment