సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::శోభన్‌బాబు,రాధిక,విజయశాంతి,సిల్క్ స్మిత
పల్లవి::
ఒకే గొడుగు..ఒకే అడుగు..ఒకే నడకగా
ఒకరి కొకరుగా..ఒకే ఒకరుగా
కలిసి పయనించే స్నేహము..వలపు వర్షించే మేఘము
ఒకే గొడుగు..ఒకే అడుగు..ఒకే నడకగా
ఒకరి కొకరుగా..ఒకే ఒకరుగా
కలిసి పయనించే స్నేహము..వలపు వర్షించే మేఘము
ఒకే గొడుగు..ఒకే అడుగు..ఒకే నడకగా
ఒకరి కొకరుగా..ఆఆఆ..ఒకే ఒకరుగా..ఆఆఆ
చరణం::1
నీలి మబ్బు మెరిసి మెరిసి..నీళ్ళ మనసు మురిసి మురిసి
ఎన్ని జలదరింపులో..ఎన్నెన్ని పులకరింతలో
చినుకు చినుకు కలిసి కలిసి..చెలిమి జల్లు కురిసి కురిసి
ఎన్ని వలపు వరదలో..ఎన్నెన్ని కలల వాగులో
ఇది భూదేవికి సీమంతం..అనురాగానికి వసంతం
ఇది భూదేవికి సీమంతం..అనురాగానికి వసంతం
ఒకే గొడుగు..ఒకే అడుగు..ఒకే నడకగా
ఒకరి కొకరుగా..ఆఆఆ..ఒకే ఒకరుగా..ఆఆఆ
చరణం::2
కన్నె తీగ తడిసి తడిసి..వన్నె మొగ్గ తొడిగి తొడిగి
ఎన్ని పూలపొంగులో..ఎన్నెన్ని రంగవల్లులో
ఇంద్రధనస్సు పందిరేసి..రంగులేడు ముగ్గులేసి
ఎన్ని మధనపూజలో..ఎన్నెన్ని మరులవిందులో
ఇది ఈ సృష్టికి ఆనందం..ఇది మన ఇద్దరి అనుబంధం
ఇది ఈ సృష్టికి ఆనందం..ఇది మన ఇద్దరి అనుబంధం
ఒకే గొడుగు..ఒకే అడుగు..ఒకే నడకగా
ఒకరి కొకరుగా..ఒకే ఒకరుగా
కలిసి పయనించే స్నేహము..వలపు వర్షించే మేఘము
ఒకే గొడుగు..ఒకే అడుగు..ఒకే నడకగా
ఒకరి కొకరుగా..ఆఆఆ..ఒకే ఒకరుగా..ఆఆఆ
No comments:
Post a Comment